
రైతులు రాయితీలను వినియోగించుకోవాలి
మహబూబాబాద్ రూరల్: ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలను రైతులు వినియోగించుకోవాలని ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళీనాయక్ అన్నారు. మహబూబాబాద్ మండలంలోని పర్వతగిరి గ్రామంలో జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో ఆయిల్ పామ్, ఉద్యాన పంటల అవగాహన కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు పంట మార్పిడి విధానాన్ని పాటించాలన్నారు. ఆయిల్ పామ్ సాగు చేసి ఎకరానికి రూ.లక్ష ఆదాయం పొందాలని తెలిపారు. జిల్లాలో 8 వేల ఎకరాలకుపైగా పామాయిల్ సాగు అవుతుందని, 1,350 ఎకరాల్లో పామాయిల్ దిగుబడి మొదలై ప్రతి రైతు ఎకరానికి రూ.లక్ష ఆదాయం పొందుతున్నారని తెలిపారు. ఈ సంవత్సరానికిగాను 4,500 ఎకరాల లక్ష్యంతో ఇప్పటి వరకు 663 ఎకరాల్లో మొక్కలు నాటడానికి రైతులు అనుమతి పొందారని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి జి.మరియన్న, రైతులు బానోత్ హరి, సీహెచ్.సంపత్ రెడ్డి, బానోత్ సూర్యం, బానోత్ రాములు, బానోత్ వెంకన్న, భూక్య బాలకిషన్, బానోత్ పద్మ, భూక్య పద్మ, భూక్యా శివలాల్, భూక్యా శైలజ, డీఏఓ అజ్మీరా శ్రీనివాసరావు, ఏఓ నారెడ్డి తిరుపతిరెడ్డి, మండల ఉద్యాన అధికారి శాంతిప్రియదర్శిని, తహసీల్దార్ చంద్రరాజేశ్వరరావు, ఎంపీడీఓ రఘుపతిరెడ్డి, వ్యవసాయ విస్తరణ అధికారులు బాలాజీ, షాహీన్, టీజీ ఆయిల్ ఫెడ్ క్షేత్ర సిబ్బంది శ్రీకాంత్ పాల్గొన్నారు.
ఎమ్మెల్యే మురళీనాయక్