
విద్యారంగంపై ప్రత్యేక దృష్టి
మహబూబాబాద్ రూరల్: రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిందని కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్ అన్నారు. మహబూబాబా ద్ మండలంలోని బ్రాహ్మణపల్లి యూపీఎస్, కొమ్ముగూడెం ఎంపీపీఎస్ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలను గురువారం ఆకస్మికంగా సందర్శించారు. మధ్యాహ్న భోజనం, తరగతి గదులు, పరిసరాలను పరిశీలించారు. విద్యార్థుల హాజరు, అభ్యసన సామర్థ్యాలు, తరగతి గదుల్లో బోధన పద్ధతులు, మధ్యాహ్న భోజన పథకం నిర్వహణపై సమగ్రంగా సమీక్షించారు. విద్యార్థుల పఠనాభివృద్ధికి పాఠశాలలు తీసుకుంటున్న చర్యలను అభినందించి, ప్రత్యేకంగా కొమ్ముగూడెం పాఠశాలలో పర్యావరణ పరిరక్షణకు గుర్తుగా కలెక్టర్ ఒక మొక్క నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం విద్యార్థుల కోసం అనేక సౌకర్యాలు కల్పిస్తూ, అత్యుత్తమ సాంకేతిక విద్యా బోధన అందించడం కోసం విద్యాశాఖను బలోపేతం చేస్తుందన్నారు. డీఈఓ రవీందర్ రెడ్డి, డీఎస్‌ఓ అప్పారావు, హెచ్‌ఎంలు భద్రు, శివలక్ష్మి, ఉపాధ్యాయులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ అద్వైత్‌మార్ సింగ్