
6న ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క రాక
మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ నియోజకవర్గ పరిధిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడానికి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క ఈ నెల 6న రానున్నారని ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ అన్నారు. మహబూబాబాద్ మండలంలోని సోమ్లాతండా వద్ద సభ ఏర్పాట్లను ఎమ్మెల్యే మురళీనాయక్.. డీసీసీ అధ్యక్షుడు జెన్నారెడ్డి భరత్ చందర్ రెడ్డి, డీఎస్పీ తిరుపతిరావు, వివిధ శాఖల అధికారులతో కలిసి గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని, మజ్జిగ, చల్లని తాగునీరు అందుబాటులో ఉంచాలని సూచించా రు. తెలిపారు. ట్రాఫిక్ నియంత్రణకు గాను పార్కింగ్ స్థలాలకు ఆప్రోచ్ రోడ్లు శనివారంలోగా పూర్తి చేయాలన్నారు. పోలీసు బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ చాలా ముఖ్యమన్నారు.
ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్