చోరీకి గురైన వాహనాల అప్పగింత | - | Sakshi
Sakshi News home page

చోరీకి గురైన వాహనాల అప్పగింత

Jul 4 2025 6:43 AM | Updated on Jul 4 2025 6:43 AM

చోరీక

చోరీకి గురైన వాహనాల అప్పగింత

వరంగల్‌ క్రైం : హనుమకొండ ట్రాఫిక్‌ పోలీసులు పకడ్బందీ తనిఖీలతో డిసెంబర్‌, 2024 నుంచి తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో చోరీకి గురైన పది బైక్‌లను రికవరీ చేసి బాధితులకు అప్పగించినట్లు అడిషనల్‌ ట్రాఫిక్‌ డీసీపీ రాయల ప్రభాకర్‌ తెలిపారు. ఇందులో భాగంగా గురువారం మహబూబాబాద్‌ జిల్లాకు చెందిన ఓ ద్విచక్రవాహనాన్ని బాధిత యజమానికి అప్పగించినట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకు అప్పగించిన పది ద్విచక్రవాహనాల్లో 9 బైక్‌లపై కరీంనగర్‌, కొండాపూర్‌, సదాశివపేట, రాజన్న సిరిసిల్ల, ఆకివీడు (ఆంధ్రప్రదేశ్‌), ధర్మసాగర్‌, సుబేదారి, గోదావరిఖని, మహబూబాబాద్‌ పోలీస్‌స్టేషన్లలో కేసులు నమోదైనట్లు, ఒక వాహనం కాటారం (భూపాలపల్లి జిల్లా)కు సంబంధించినట్లు వివరించారు. కార్యక్రమంలో వరంగల్‌ ట్రాఫిక్‌ ఏసీపీ టి.సత్యనారాయణ, హనుమకొండ ట్రాఫిక్‌ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

పాము కాటుతో రైతు మృతి

రాజోలులో ఘటన

కురవి: పొలంలో పనిచేస్తుండగా పాము కాటు వేయడంతో ఓ రైతు మృతి చెందాడు. ఈ ఘటన గురువారం మండలంలోని రాజోలులో చోటుచేసుకుంది. ఎస్సై గండ్రాతి సతీశ్‌ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన గోదాసి వరదయ్య(66) తన పొలంలో పనిచేసుకుంటున్న క్రమంలో పాము కాటు వేయడంతో అక్కడి నుంచి ఇంటికొచ్చి తన మనుమడికి విషయం చెప్పాడు. వెంటనే వరదయ్యను మహబూబాబాద్‌ జనరల్‌ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి కుమారుడు సైదులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గండ్రాతి సతీశ్‌ తెలిపారు.

గంజాయి సేవిస్తున్న నలుగురు యువకుల అరెస్ట్‌

న్యూశాయంపేట : వరంగల్‌ శివనగర్‌లోని ఓ ఇంట్లో గంజాయి సేవిస్తున్న నలుగురు యువకులను వరంగల్‌ నార్కోటిక్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. నార్కోటిక్స్‌ డీఎస్పీ సైదులు కథనం ప్రకారం.. నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో ట్రోల్‌ ఫ్రీ నంబర్‌ 1908కు వచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు బుధవారం రాత్రి ఆ ఇంటికి చేరుకున్నారు. గంజాయి సేవిస్తున్న నలుగురు యు వకులను అరెస్ట్‌ చేసిన రిమాండ్‌ నిమిత్తం కో ర్టులో హాజరు పరిచినట్లు తెలిపారు. కాగా, ఆ నలుగురు యువకులు పద్మాక్షి గుట్ట వద్ద షెహర్‌లాల్‌ అనే వ్యక్తి నుంచి గంజాయి కొనుగోలు చేశారని, అతడిని త్వరలో అరెస్ట్‌ చేస్తామని డీ ఎస్పీ గురువారం పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్సై మొగిలి హెడ్‌కానిస్టేబుల్‌ సోమలింగం, కానిస్టేబుళ్లు రాజేశ్‌, విజయ్‌ పాల్గొన్నారు.

చోరీకి గురైన వాహనాల అప్పగింత
1
1/2

చోరీకి గురైన వాహనాల అప్పగింత

చోరీకి గురైన వాహనాల అప్పగింత
2
2/2

చోరీకి గురైన వాహనాల అప్పగింత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement