
బట్టలు విప్పాలనే ఉత్సాహంగా ఉందా..
జనగామ: ‘అసెంబ్లీలో మా బట్టలు విప్పుతామంటున్నారు, అక్కడ చర్చ మాత్రమే జరగాలి, మీ పార్టీ(బీఆర్‌ఎస్)ఆఫీసుకు నాతోపాటు కార్యకర్తలతో కలిసి వచ్చి గుడ్డలు విప్పి చూపిస్తాం, ఏం కావా లో చూసుకోండి’ అంటూ భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్‌రెడ్డి.. మాజీ మంత్రి హరీశ్‌రావును ఉద్దేశించి హాట్ కామెంట్స్ చేశారు. జనగామ జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో గురువారం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందించిన ఎంపీ మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని, దీనిని చూసి ఓర్వలేని బీఆర్‌ఎస్ నాయకులు చెడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనపై చర్చ కోసం అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేస్తామని పదేపదే చెబుతున్నా, బీఆర్‌ఎస్ నేతలు సిద్ధంగా లేరన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి హోదాలో రాయలసీమ రతనాల సీమ చేస్తామని, చేపల పులుసు తిని హామీ ఇచ్చి, ఈ రోజు బనకచర్ల బంకను తీసుకువచ్చి, మళ్లీ తెలంగాణ ఉద్యమ సెంటిమెంటును రగిలించేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. బీఆర్‌ఎస్ పార్టీ ఆఫీసుకు వచ్చి బట్టలు విప్పేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, నీ వు, నీ బామ్మర్ధి చూసుకునేందుకు సిద్ధమా అని ఎంపీ.. హరీశ్‌రావు వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు.
మీడియాతో మాట్లాడుతున్న ఎంపీ చామల
బావ, బామ్మర్దులకు
ఏం కావాలో చూసుకోండి
అసెంబ్లీలో చర్చ మాత్రమే జరగాలి
భువనగిరి ఎంపీ చామల హాట్ కామెంట్స్