
నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు
తొర్రూరు: ప్రభుత్వ నిబంధనలు పాటించని ప్రైవేట్ ఆస్పత్రులపై చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్‌ఓ రవి రాథోడ్ అన్నారు. బుధవారం తొర్రూరు పట్టణ కేంద్రంలోని పలు ప్రైవేట్ ఆస్పత్రులను సందర్శించారు. రికార్డులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆస్పత్రుల్లో అత్యవసర ఫోన్ నంబర్లు, రుసుము వివరాలు, డాక్టర్ల సమాచారంతో పాటు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు కనిపించేలా ప్రదర్శించాలని సూచించారు. ఫైర్ సేప్టీ పరికరాలు, సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని, సిబ్బంది అర్హత పత్రాలు అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. కొత్త సిబ్బంది నియామకాన్ని ముందుగానే అధికారులకు తెలియజేయాలని సూచించారు. విదేశాల్లో ఎంబీబీఎస్ చేసిన వారు భారత అర్హత పరీక్ష ఉత్తీర్ణత సాధించాలన్నారు. తప్పుడు హోదాలో ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో సీహెచ్‌ఓ విద్యాసాగర్, డిప్యూటీ పారామెడికల్ అధికారి వనాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
డీఎంహెచ్‌ఓ రవి రాథోడ్