
బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి చేయాలి
మహబూబాబాద్: బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లోని ఎన్‌ఐసీ హాల్‌లో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన అంశంపై సంబంధిత అఽధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆపరేషన్ స్మైల్, ముస్కాన్ క్షేత్రస్థాయిలో పకడ్బందీగా అమలు చేయాలన్నారు. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు సంబంధించిన చట్టాలను పక్కాగా అమలు చేయాలన్నారు. ఈనెల 1నుంచి 31వ తేదీ వరకు ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాన్ని చేపట్టి బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనే లక్ష్యంగా అఽధికారులు పని చేయాలన్నారు. చైల్డ్ హెల్ప్ లైన్ 1098, 112 నంబర్లపై విస్తృత ప్రచారం చేయాలన్నారు. సమావేశంలో సీడబ్యూసీ చైర్‌పర్సన్ నాగవాణి, ఇన్‌చార్జ్ డీడబ్ల్యూఓ శిరీష, డీఎస్పీ తిరుపతి రావు, డీఈఓ రవీందర్‌రెడ్డి, డీఎంహెచ్‌ఓ రవిరాథోడ్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్