
మేడిగడ్డకు పెరుగుతున్న వరద
పొంగిన పాకాల ఏరు
గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మహబూబాబాద్ జిల్లా గార్ల సమీపంలోని పాకాల ఏరు బుధవారం సాయంత్రం నుంచి చెక్‌డ్యాంనుంచి ప్రవహిస్తోంది. దీంతో గార్ల నుంచి రాంపురం, మద్దివంచ పంచాయతీల గ్రామాల ప్రజలు మండల కేంద్రమైన గార్లకు వచ్చేందుకు ఇబ్బందులు పడుతున్నారు. పాకాల ఏటిపై హైలెవెల్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టి ఈ గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించాలని ఈ ప్రాంతాల ప్రజలు కోరుతున్నారు.
– గార్ల
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం అంబట్‌పల్లి సమీపంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ(లక్ష్మి)బ్యారేజీకి ప్రాణహిత వరద తాకిడి రోజురోజుకూ పెరుగుతోంది. మహారాష్ట్రలో నాలుగు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో ప్రాణహిత వరద ప్రవాహం కాళేశ్వరం మీదుగా మేడగడ్డకు చేరుతోంది. దీంతో బుధవారం సాయంత్రం వరకు 36,900 క్యూసెక్కుల వరద ప్రవాహం బ్యారేజీలోని మొత్తం 85గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు.

మేడిగడ్డకు పెరుగుతున్న వరద