
కేసీఆర్, కేటీఆర్ జైలుకెళ్లడం ఖాయం
వేలేరు: కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్ కేసులతో కేసీఆర్, కేటీఆర్ జైలుకెళ్లడం ఖాయమని స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. బుధవారం వేలేరు మండల కేంద్రంలోని రైతు వేదికలో 17 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోవడానికి కేసీఆర్, హరీశ్‌రావే ప్రధాన కారణమని ఆరోపించారు. మేడిగడ్డ లేకపోతే కాళేశ్వరం ప్రాజెక్టు లేదని, మనిషికి గుండె ఎంత ముఖ్యమో కాళేశ్వరానికి కూడా మేడిగడ్డ అంతేముఖ్యమన్నారు. రూ.లక్ష కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ద్వారా కనీసం 50 వేల ఎకరాలకు కూడా సాగునీరు అందలేదని విమర్శించారు. బనకచర్ల ప్రాజెక్టుకు నాంది పలికింది కేసీఆరేనని, గతంలో ఆయన ఆంధ్రా ప్రాజెక్టులకు సహకరిస్తామని చెప్పి ఇప్పుడు తప్పించకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ హక్కులే ముఖ్యమని, బనకచర్ల, పోలవరం ప్రాజెక్టులను ఆపి తీరుతామన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ హెచ్.కోమి, ఎంపీడీఓ లక్ష్మీప్రసన్న, ఏఓ కవితా, ఎంపీఓ భాస్కర్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కత్తి సంపత్, కాంగ్రెస్ నాయకులు బిల్లా యాదగిరి, సద్దాం హుస్సేన్, మల్లికార్జున్, రాజిరెడ్డి, ప్రమోద్ రెడ్డి, లక్ష్మణ్‌నాయక్, రవీందర్, రణధీర్ రెడ్డి, సలీంమాలిక్, తదితరులు పాల్గొన్నారు.
కాళేశ్వరం కూలిపోవడానికి కేసీఆర్, హరీశ్‌రావే కారణం
స్టేషన్ ఘన్‌పూర్
ఎమ్మెల్యే కడియం శ్రీహరి