బడి బస్సు భద్రమేనా? | - | Sakshi
Sakshi News home page

బడి బస్సు భద్రమేనా?

Jun 8 2025 1:57 AM | Updated on Jun 8 2025 1:57 AM

బడి బ

బడి బస్సు భద్రమేనా?

మహబూబాబాద్‌ అర్బన్‌: ఈ విద్యాసంవత్సరం ఈనెల 12వ తేదీ నుంచి పాఠశాలల పునఃప్రారంభం కానున్నాయి. బడిలో అడుగు పెట్టేందుకు విద్యార్థులు సన్నద్ధమవుతున్నారు. నిత్యం వారు ప్రయాణించే బస్సుల సామర్థ్యం ప్రశ్నార్థకంగానే ఉంటుంది. ప్రైవేట్‌ బడుల బస్సులు రోడ్డు ఎక్కాలంటే ఫిట్‌నెస్‌ తప్పనిసరి. లేదంటే బస్సులను సీజ్‌ చేసేందుకు రవాణాశాఖ అధికారులు ముందస్తుగా పాఠశాల యాజమాన్యాలను అప్రమత్తం చేసినా.. నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు. జిల్లాలో 118 ప్రైవేట్‌ పాఠశాలలు ఉండగా సుమారు 222 బస్సులు ప్రస్తుతం పాఠశాలల్లో నడుస్తున్నాయి. ఈ ఏడాది ప్రత్యేకంగా బస్సుల తనిఖీ కోసం పాఠశాలలు ప్రారంభం కాగానే ప్రత్యేక టీంలను అధికారులు సిద్ధం చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన ప్రైవేట్‌ పాఠశాలల బస్సులపై కొరఢా ఝులిపించేందుకు సిద్ధంగా ఉన్నారు.

ఫిట్‌నెస్‌ పరీక్షలపై నిర్లక్ష్యం..

స్కూలు, కళాశాల బస్సు ఫిట్‌నెస్‌ అర్హత సాధించాలంటే అనేక నిబంధనలు ఉన్నాయి. కానీ పాఠశాలల యాజమాన్యాలు నిబంధనలు నీరుగారుస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో పాత బస్సులకు కొత్తరంగులు అద్ది బస్సులు నడిపిస్తున్నారనే విమర్శలు వినపడుతున్నాయి. రవాణాశాఖ నిర్ధేశించిన ప్రమాణాలు పాఠశాలల యాజమాన్యాలు పట్టించుకోవడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. మానుకోట జిల్లాకేంద్రం చుట్టుపక్కల ఉన్న మండలాలకు, గ్రామాలకు ఎక్కువ శాతం బస్సులు నడుస్తున్నాయి. పాఠశాలల బస్సులకు ఫిట్‌నెస్‌ పరీక్షలు చేయించకుండా గడువు తేదీ చివరి వరకు వేచిఉండి వెంటవెంటనే ఫిట్‌నెస్‌ పరీక్షలు నిర్వహించాలని ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలు చూస్తున్నట్లు సమాచారం. మోటారు వాహనాల చట్టం 185(ఎఫ్‌) ప్రకారం విద్యా సంస్థల బస్సులు నిబంధనల ప్రకారం ఫిట్‌నెస్‌తోపాటు అన్ని ధ్రువీకరణ పత్రాలను విద్యాసంస్థల యాజమాన్యాలు సమకూర్చుకోవాలి.

ప్రైవేట్‌ స్కూల్‌ బస్సులు (ఫైల్‌)

ఫిట్‌నెస్‌ లేకుంటే బస్సులు సీజ్‌..

పాఠశాలలు, కళాశాలలు పునఃప్రారంభం అయ్యేలోపు ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలు తమ బస్సులను ఫిట్‌నెస్‌ పరీక్షలు చేయించుకుని ధ్రువీకరణ పత్రం పొందాలి. ఆ తర్వానే విద్యార్థులను ఎంచుకుని బస్సులు నడిపించాలి. ఫిట్‌నెస్‌ లేకుండా బస్సులు నడిపితే వాటిని సీజ్‌ చేసి శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం.

–జైపాల్‌రెడ్డి, జిల్లా రవాణా శాఖ అధికారి

నిబంధనలు ఇవే..

● రవాణాశాఖ కార్యాలయానికి ఫిట్‌నెస్‌ కోసం వచ్చే బస్సుల్లో 15 సంవత్సరాలు దాటిన వాటికి ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ ఇవ్వడానికి వీలు లేదు.

● 15లోపు ఉన్న స్కూలు, కళాశాల బస్సులు, వాహనాల కండీషన్‌, ఇంజిన్‌ కండీషన్‌ పూర్తిస్థాయిలో పరిశీలించాలి.

● విద్యార్థులు కూర్చునే సీట్లు, బస్సులు ఎక్కే ఫుట్‌బోర్డు, బస్సు కిటికీల నుంచి బయటకు చూడటానికి గ్రిల్స్‌ తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి.

● ఇంజిన్‌ కంపార్ట్‌మెంట్‌లో తప్పనిసరిగా అగ్నిమాపక పరికరం ఉండాలి.

● విద్యార్థులు బస్సులో నుంచి దిగడం, ఎక్కడం స్పష్టంగా కనిపించేందుకు కన్వెక్స్‌ అద్దాలు ఉండాలి.

● ఫస్ట్‌ ఎయిడ్‌ బాక్స్‌ను బస్సులో ఏర్పాటు చేయాలి.

● బస్సు డ్రైవర్‌ కనీస విద్యార్హత 8వ తరగతి పాసై ఉండాలి. హెవీ వెహికిల్‌ లైసెన్స్‌, అనుభవం ఉండాలి.

● జిల్లా రవాణాశాఖ అధికారిచే జారీ చేయబడిన విద్యాసంస్థల బస్సు పర్మిట్‌, బస్సు జీవిత కాలపు తేదీ తప్పనిసరిగా ఉండాలి.

● బస్సులో పరిమితికి మించి విద్యార్థులను తీసుకెళ్లరాదు.

● డ్రైవర్‌కు మద్యం తాగి వాహనం నడిపే అలవాటు ఉండొద్దు.

స్కూల్‌ బస్సులకు ఫిట్‌నెస్‌ తప్పనిసరి

మరో నాలుగు రోజుల్లో పాఠశాలలు పునఃప్రారంభం

నిర్లక్ష్యంలో పాఠశాలల యాజమాన్యం

బడి బస్సు భద్రమేనా?1
1/2

బడి బస్సు భద్రమేనా?

బడి బస్సు భద్రమేనా?2
2/2

బడి బస్సు భద్రమేనా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement