
1,200 మంది విద్యార్థులకు ఉద్యోగాలు
హసన్‌పర్తి: ఎస్సార్ యూనివర్సిటీలో 1,200 మంది విద్యార్థులు వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించడంపై శుక్రవారం సాయంత్రం సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్సార్ యూనివర్సిటీ చాన్స్‌లర్ ఎ.వరదారెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ విజయాలు పరిశ్రమ అవసరాలను గుర్తించి విద్యార్థులకు నాణ్యమైన శిక్షణ అందించిన ఫలితంగా సాధ్యమయ్యాయన్నారు. విద్యార్థులను ప్రోత్సహిస్తూ అన్ని కోణాల్లో వారిని అభివృద్ధి చేయడమే లక్ష్యమని తెలిపారు. ఈ విజయాల్లో కీలకంగా పనిచేసిన డీన్లు, వివిధ శాఖాధికారులు, డైరెక్టర్లు, ప్లేస్మెంట్ సమన్వయ కర్తల కృషిని అభినందించారు. ఎస్సార్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ డాక్టర్ దీపక్‌గార్గ్ మాట్లాడుతూ.. విద్యార్థులకు ఉన్నత విద్యలో అవకాశాలు కల్పించేందుకు అనేక అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో అసోసియేట్ డైరెక్టర్ జి.సునీల్‌రెడ్డి, రిజిస్ట్రార్ డాక్టర్ అర్చనారెడ్డి, ప్రొ వైస్ చాన్స్‌లర్ డాక్టర్ మహేష్‌తోపాటు వివిధ విభాగాల అధిపతులు, తదితరులు పాల్గొన్నారు.