త్యాగాల పండుగ.. బక్రీద్‌ | - | Sakshi
Sakshi News home page

త్యాగాల పండుగ.. బక్రీద్‌

Jun 7 2025 1:32 AM | Updated on Jun 7 2025 1:32 AM

త్యాగ

త్యాగాల పండుగ.. బక్రీద్‌

నేడు ఈదుల్‌ జుహా..

ఖుర్బానీ..

బక్రీద్‌ సందర్భంగా ముస్లింలు ఖుర్భానీ ఇవ్వడం అ త్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఒక పొట్టేలు మాంసాన్ని మూడు భాగాలుగా చేసి.. ఒక భా గాన్ని నిరుపేదలకు, మిగిలిన భాగాల్లో రెండోది బంధువులకు, మూడోది తమ కోసం ఉంచుకుంటారు. దీనిని ఖుర్బానీ అంటారు.

హజ్‌యాత్ర..

ముస్లింలు ఈ పవిత్రమైన మాసంలోనే మక్కాను సందర్శించేందుకు వెళ్తారు. సౌదీ అరేబియాలోని మక్కా నగరం వెళ్లి మసీదు–అల్‌ హరామ్‌లోని కాబా చుట్టూ ఏడు సార్లు ప్రదక్షిణలు చేస్తారు. బక్రీద్‌ పండుగ రోజు ముస్లింలు ఈద్గాల వద్దకు వెళ్లి సామూహిక ప్రార్థనలు చేస్తారు. ప్రార్థనల అనంతరం ఈద్‌ ముబారక్‌తో ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకుంటారు.

ఈద్గాల వద్ద ఏర్పాట్లు..

ముస్లింలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే బక్రీద్‌(ఈదుల్‌ జుహా) పర్వదినాన్ని ఘనంగా నిర్వహించుకునేందుకు ఉమ్మడి వరంగల్‌ జిల్లా వ్యాప్తంగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈద్గా, మసీదుల్లో శనివారం ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు. జనగామ జిల్లా కేంద్రంలోని సిద్దిపేట రోడ్డులోని ఈద్గా, ఖిలా వరంగల్‌ ఈద్గాను శుభ్రపరిచి, భక్తులు కూర్చునేలా ఏర్పాట్లు చేశారు.

పోలీసు బందోబస్తు..

బక్రీద్‌ సందర్భంగా ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని ఈద్గాల వద్ద పోలీసుల పట్టిష్ట బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. జనగామ డీసీపీ రాజమహేంద్ర నాయక్‌ పర్యవేక్షణలో ఏసీపీ పండేరి చేతన్‌ నితిన్‌ ఆధ్వర్యంలో సీఐ, ఎస్సైలు బందోబస్తు నిర్వహించనున్నారు. కాగా, ఈద్గాల వద్ద షామీయానాలతో పాటు పండగకు సంబంధించిన ఏర్పాట్లను ముస్లిం పెద్దలు పర్యవేక్షిస్తున్నారు. ప్రత్యేక ప్రార్థనలు చేసిన అనంతరం పెద్దల సమాధుల వద్ద నివాళులర్పించనున్నారు.

ఉమ్మడి వరంగల్‌ జిల్లా వ్యాప్తంగా వేడుకలకు సర్వం సిద్ధం

ఉదయం 9గంటలకు

సామూహిక ప్రార్థనలు

ఏర్పాట్లను పరిశీలించిన

ఈద్గా ప్రతినిధులు

పండుగ విశిష్టత..

హజ్రత్‌ ఇబ్రహీం అనే ప్రవక్త నిద్రిస్తున్న సమయంలో ఆయన కలలో అల్లాహ్‌ కనిపించి నీ కుమారుడిని తనకు బలి ఇవ్వమని ఆదేశిస్తాడు. నిద్రలేచిన తర్వాత ఇబ్రహీం తనకు వచ్చిన కల గురించి తన ఒక్కగానొక్క కుమారుడు ఇస్మాయిల్‌కు వివరిస్తాడు. దైవ భక్తుడైన ఇస్మాయిల్‌ అందుకు అంగీకరించి బలికి సిద్ధమవుతాడు. దీంతో కుమారుడిని బలిస్తున్న సమయంలో అల్లాహ్‌ అతడి త్యాగ నిరతిని మెచ్చుకుని బలి ఇవ్వడానికి ఆకాశవాణి ద్వారా ఓ గొర్రెను సృష్టించి ఇస్తాడు. నాటి నుంచి ఈ పండుగను బక్రీద్‌ అని పిలుస్తారు.

రంజాన్‌ తర్వాత ముస్లింలు అత్యంత పవిత్రంగా జరుపుకునే పండుగ బక్రీద్‌ . ప్రవక్త ఇబ్రహీం కుమారుడి త్యాగానికి గుర్తుగా.. పవిత్ర మక్కా హజ్‌ తీర్థ యాత్రకు ముగింపుగా ఈ పండుగ సూచిస్తుంది. దాన, ధర్మాలు చేయడం ఆచారం. పేద, ధనిక తారతమ్యం లేకుండా పండుగను జరుపుకుంటారు. దైవ ప్రవక్త హజ్రత్‌ ఇబ్రీహీం అల్లాహ్‌ ప్రసన్నం కోసం చేసిన మహోన్నత త్యాగాన్ని ఈ పండుగ సందర్భంగా ముస్లింలు స్మరించుకుంటారు. ఈదుల్‌ ఫితర్‌ తర్వాత రెండు నెలలకు ఇస్లాం క్యాలెండర్‌ ప్రకారం 12వ నెల(జుల్‌ హజ్జా) 10వ రోజున బక్రీద్‌ను జరుపుకుంటారు. నేడు బక్రీద్‌ పండుగ సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం.

–జనగామ/ఖిలా వరంగల్‌

సామూహిక ప్రార్థనలకు సర్వం సిద్ధం

ఈద్గాలో నేడు ఉదయం 9 గంటలకు ఈదుల్‌ జుహా ప్రత్యేక ప్రార్థనలు జరుగుతాయి. ముఖ్యఅతిఽఽథులుగా మంత్రి కొండా సురేఖ, ఎంపీ కడియం కావ్య, మేయర్‌ గుండు సుధారాణి, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు, స్థానిక కార్పొరేటర్‌ సిద్ధం రాజు, పోశాల పద్మ, ఇతర ప్రజా ప్రతినిధులు హాజరవుతున్నారు. ఉదయం 9గంటల లోపు ముస్లింలు అధిక సంఖ్యలో హాజరై సామూహిక ప్రార్థనలు చేయాలి.

ఎంఏ జబ్బార్‌, ఈద్గా ప్రతినిధి,

ఫోర్ట్‌ రోడ్డు, వరంగల్‌

త్యాగాల పండుగ.. బక్రీద్‌ 1
1/2

త్యాగాల పండుగ.. బక్రీద్‌

త్యాగాల పండుగ.. బక్రీద్‌ 2
2/2

త్యాగాల పండుగ.. బక్రీద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement