యువత చూపు.. టైపు వైపు | - | Sakshi
Sakshi News home page

యువత చూపు.. టైపు వైపు

Jun 6 2025 1:00 AM | Updated on Jun 6 2025 1:00 AM

యువత

యువత చూపు.. టైపు వైపు

కాజీపేట: టైపు రైటింగ్‌ .. ఒకప్పుడు ఈ కోర్సు నేర్చుకుంటే ఉద్యోగం గ్యారంటీ. దీంతో టైపు ఇన్‌స్టిట్యూట్‌లు కిటకిటలాడేవి. తర్వాతి కాలంలో కంప్యూటర్ల వినియోగం పెరిగింది. ఫలితంగా యువత అటు వైపు ఆసక్తి కనబర్చడంతో టైపు రైటింగ్‌కు కొంత ప్రాధాన్యం తగ్గింది. కానీ ప్రస్తుత కాలంలో తిరిగి టైపు రైటింగ్‌కు ఆదరణ పెరిగింది. ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాల్లో ఉద్యోగావకాశాలు అవకాశాలు లభిస్తుండడంతో యువత టైపు రైటింగ్‌ నేర్చుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇందుకు అనుగుణంగా వరంగల్‌ నగరంలో 8 ఇన్‌స్టిట్యూట్‌లలో శిక్షణ ఇస్తున్నారు. నిత్యం సుమారు 350 మంది యువతీ, యువకులు బ్యాచ్‌ల వారీగా శిక్షణ పొందుతున్నారు.

ఉద్యోగాల్లో ప్రాధాన్యం..

1714లో హెన్రీ మిల్‌ కనుగొన్న ఈ టైపు మిషన్‌కు అనంతర కాలంలో ప్రాధాన్యం ఏర్పడింది. టైపు రైటింగ్‌లో లోయర్‌, హయ్యర్‌ పూర్తి చేసిన వారికి ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరిగింది. దీంతో విద్యార్తులు ఓ వైపు చదువుకుంటూనే.. ఖాళీ సమయంలో టైపు రైటింగ్‌ కోర్సు నేర్చుకుంటున్నారు. టైపు రైటింగ్‌లో హయ్యర్‌, లోయర్‌ పూర్తి చేసిన వారికి ప్రభుత్వ కార్యాలయాలతో పాటు కార్పొరేట్‌ సంస్థలు, కోర్టుల్లో టైపిస్ట్‌లుగా, జడ్జిలకు పీఏలుగా పనిచేసే అవకాశం లభిస్తుంది.

రాష్ట్ర ప్రభుత్వ ప్రకటనతో చిగురించిన ఆశలు..

ఏడున్నర సంవత్సరాల అనంతరం రాష్ట్ర ప్రభుత్వం వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీ పోస్టులను వేల సంఖ్యలో భర్తీ చేయనున్నట్లు ప్రకటన చేయడంతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురించాయి. దీంతో వందల సంఖ్యలో యువకులు టైపు ఇన్‌స్టిట్యూట్‌లకు రావడంతో ఆదరణ పెరిగింది. స్టేట్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ బోర్డు ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్లు అందజేస్తున్నారు.

కోర్సుల వివరాలు..

లోయర్‌: మూడు నెలలు ప్రాక్టీస్‌ చేయాలి. నిమిషానికి 30 పదాలు టైపు చేయాల్సి ఉంటుంది.

హయ్యర్‌: ఆరు నెలలు ప్రాక్టీస్‌ చేయాలి. నిమిషానికి 45 పదాలు టైపు చేయాల్సి ఉంటుంది.

బ్యాచ్‌ల వారీగా శిక్షణ..

25 సంవత్సరాలుగా టైపులో బ్యాచ్‌ల వారీగా శిక్షణ ఇస్తున్నాం. ఇక్కడ శిక్షణ తీసుకుంటున్న విద్యార్థుల్లో ప్రతీ సంవత్సరం కనీసం పదిమంది వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ప్రైవేట్‌ కంపెనీల్లో ఉద్యోగాలు సాధిస్తున్నారు. ప్రస్తుతం టైపు రైటింగ్‌ నేర్చుకునేందుకు యువత ఆసక్తి చూపుతోంది.

– సిరికొండ రామేశ్వరాచారి,

లిఖిత టైపు రైటింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌

పెరుగుతున్న ఉద్యోగావకాశాలు..

ఇటీవలి టైపు రైటింగ్‌ నేర్చుకు న్న వాళ్లకు ఉద్యోగావకాశాలు వి స్తృతంగా లభిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థల్లో ఉద్యోగాల భర్తీకి నోటీఫికేషన్లు వెలువడుతున్నాయి. దీంతో టైపు నేర్చుకోవాలనే అభిలాషతో శిక్షణ తీసుకుంటున్నాం.

– దుబ్బ రాము, కాజీపేట

టైపు రైటింగ్‌కు పెరిగిన ఆదరణ

ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే

లక్ష్యంగా సాధన

యువత చూపు.. టైపు వైపు 1
1/2

యువత చూపు.. టైపు వైపు

యువత చూపు.. టైపు వైపు 2
2/2

యువత చూపు.. టైపు వైపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement