నేడు పింఛన్ల పంపిణీ
కర్నూలు(అగ్రికల్చర్): ఇంటిదగ్గర పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని చంద్రబాబు ప్రభుత్వం క్రమంగా కొండెక్కిస్తోంది. డిసెంబరు నెల పింఛన్లను సోమవారం ఉదయం నుంచి పంపిణీ చేయనున్నారు. ఇందుకోసం కర్నూలు జిల్లాలో పింఛన్లకు 2.37.733 రూ.104.32 కోట్లు, నంద్యాల జిల్లాలో 2.14.072 పింఛన్లకు రూ.92.39 కోట్లు విడుదల అయ్యాయి. లబ్ధిదారుల ఇళ్లను జియో ట్యాగింగ్ చేశారు. జియోట్యాగింగ్ చేసిన ఇంటి నుంచి 300 మీటర దూరంలో పింఛన్ పంపిణీ చేయవచ్చు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పంచాయతీ సెక్రటరీలతో సహా ప్రతి ఒక్కరూ పింఛన్‌లు పంపిణీ చేయాల్సి ఉంది. అనధికారికంగా పంచాయతీ సెక్రటరీలు పింఛన్ల పంపిణీ నుంచి మినహాయింపు పొందుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మద్దిలేటి స్వామి క్షేత్రంలో వాట్సాప్ సేవలు
బేతంచెర్ల: జిల్లాలోని ప్రముఖ వైష్ణవ పుణ్యక్షేత్రమైన శ్రీ మద్దిలేటి నరసింహ స్వామి ఆలయంలో భక్తులకు వాట్సాప్ ద్వారా సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు ఉప కమిషనర్ రామాంజనేయులు తెలిపారు. వాట్సాప్ ద్వారా భక్తులకు దర్శనం, ప్రసాదం, రూముల బుకింగ్ సేవలను పొందవచ్చన్నారు. ఈ సేవలను వినియోగించుకోవడానికి భక్తులు 9552300009 సంప్రదించాలని సూచించారు.
అరకొర అర్టీసీ బస్సులు
పాణ్యం: ఆర్టీసీ బస్సులు అరకొర ఉండటంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నాయి. బస్టాండ్‌ల వద్ద గంటల తరబడి వేచి ఉన్నా బస్సులు రావడం లేదు. పాణ్యం ఆర్టీసీ బస్టాండ్‌లో ఆదివారం ప్రయాణికులు రద్దీ కనిపించింది. కొన్ని ఆర్టీనరీ, ఎక్స్‌ప్రెస్‌లు వచ్చినా కాలు పెట్టేందుకు వీలు లేనంతగా నిండిపోయి ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని ఆర్టీసీ బస్సులు నడపాలని ప్రజలు కోరారు.
కర్నూలు(అగ్రికల్చర్): తిరుపతిలోని ఏపీఎస్‌పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో డిసెంబరు1వ తేదీన డయల్ యువర్ ఏపీఎస్‌పీడీసీఎల్ సీఎండీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ తెలిపారు. వినియోగదారులు ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యలను ఫోన్ ద్వారా తమ దృష్టికి తెస్తే వెంటనే పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వినియోగదారులు ఉదయం 10 నుంచి 12 గంటల వరకు 89777 16661కు ఫోన్ చేసి సమస్యల గురించి చెప్పవచ్చని తెలిపారు.
టీడీపీ నాయకులను అరెస్ట్ చేయాలి
● ప్రజా సంఘాల నాయకుల నిరసన
కర్నూలు (టౌన్): నెల్లూరులో గంజాయికి వ్యతిరేకంగా పోరాడిన సీపీఎం నేత పెంచలయ్యను హత్య చేసిన టీడీపీ నాయకులపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని ప్రజాసంఘాల నేతలు డిమాండ్ చేశాయి. కర్నూలు కలెక్టరేట్ ఎదుట గాంధీ విగ్రహం వద్ద కొవ్వొత్తులతో ఆదివారం రాత్రి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా సీఐటీయూ, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అంజిబాబు, రాధకృష్ణ మాట్లాడుతూ.. గంజాయిను టీడీపీ నాయకులు ఆదాయ వనరుగా మార్చుకున్నారని విమర్శించారు.
నేడు పింఛన్ల పంపిణీ


