
పేకాటరాయుళ్ల అరెస్టు
కోసిగి: మండలంలోని పెద్దభూంపల్లి గ్రామ శివారులోని కోసిగి ఆంజనేయ పొలంలో వేప చెట్టుకింద పేకాట ఆడుతున్న వారిని అరెస్ట్ చేశామని కోసిగి సీఐ మంజునాథ్, ఎస్‌ఐ హనుమంతరెడ్డి తెలిపారు. శుక్రవారం స్థానిక సర్కిల్ కార్యాలయంలో నిందుతులను అరెస్ట్ చూపించి వివరాలు వెల్లడించారు. చిన్నభూంపల్లి గ్రామానికి చెందిన బలోని హనుమంతు, చిన్న ఉశేని, శివకుమార్, నాగరాజు, చాకలి శివకుమార్, రమేష్, కల్లూరి పద్మయ్య, నాగేంద్ర, జింకల మదసాబ్, మంత్రాలయం మండలం రాంపురం గ్రామానికి చెందిన వడ్డే నరసింహ, ఖాసిం, షేక్ వహాబ్, ఐరన్‌గల్ గ్రామానికి చెందిన తారాపురం రంగయ్య, జంపాపురం గ్రామానికి చెందిన చిదానంద, సి.బెళగల్ గ్రామానికి చెందిన వీరేష్ పేకాట ఆడుతున్నారనే సమాచారం మేరకు దాడి చేసి అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. వారి నుంచి రూ.52 వేల నగదు, 6 ద్విచక్ర వాహనాలు, 7 సెల్‌ఫోన్‌లను సీజ్ చేసి వారిపై కేసు నమోదు చేశామని వివరించారు.
6 ద్విచక్ర వాహనాలు, 7సెల్ ఫోన్‌లు సీజ్
రూ. 52వేల నగదు స్వాధీనం