క‘రుణ’ చూపుతూ.. ‘ఉపాధి’ కల్పిస్తూ.. | - | Sakshi
Sakshi News home page

క‘రుణ’ చూపుతూ.. ‘ఉపాధి’ కల్పిస్తూ..

Jun 5 2025 8:04 AM | Updated on Jun 5 2025 8:06 AM

యువతకు ఆశాకిరణంగా

కెనరాబ్యాంకు గ్రామీణ స్వయం

ఉపాధి శిక్షణ సంస్థ

ఉచిత భోజన వసతి,

హాస్టల్‌ సదుపాయం

ఇప్పటి వరకు 9,342 మందికి శిక్షణ..

3,701 మందికి రుణాలు

కొత్తగా పురుషులకు

ఫోర్‌ వీలర్‌ డ్రైవింగ్‌లో శిక్షణ

చిత్రంలోని మహిళ పేరు ఉమాదేవి. బేతంచెర్లకు చెందిన ఈ మహిళ టైలరింగ్‌లో 30 రోజుల శిక్షణ పొందారు. శిక్షణ పొందిన తర్వాత కర్నూలులో టైలర్‌ షాపు పెట్టుకున్నారు. నెలకు రూ.25 వేల వరకు ఆదాయం పొందుతున్నారు.

మహిళ పేరు శోభారాణి. కర్నూలులో నివాసం ఉంటున్నారు. డిగ్రీ పూర్తి చేసిన ఈ మహిళ బ్యూటీ పార్లర్‌లో శిక్షణ పొందారు. శిక్షణ తర్వాత బ్యాంకు రుణసదుపాయం కల్పించింది. ఈమె కర్నూలులో బ్యూటీపార్లర్‌ఏర్పాటు చేసుకున్నారు. నెలకు అన్ని ఖర్చులు పోనూ రూ.30 వేల వరకు నికరాదాయం పొందుతున్నారు.

కర్నూలు(అగ్రికల్చర్‌): ఉమ్మడి కర్నూలు జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన యువతకు కెనరాబ్యాంకు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్ధ (రూరల్‌ సెల్ప్‌ ఎంప్లాయిమెంటు ట్రైనింగ్‌ ఇనిస్టిట్యూట్‌–ఆర్‌ఎస్‌ఈటీఐ) అండగా నిలిచింది. నాణ్యమైన ఉచిత శిక్షణ ఇవ్వడంతోపాటు హాస్టల్‌ వసతి కల్పిస్తోంది. స్వయం ఉపాధిలో రాణించేందుకు బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం కూడా కల్పిస్తోంది. కెనరాబ్యాంకు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ 2023 ఆగస్టు 5న ఆవిర్భవించింది. కొద్ది నెలల క్రితం వరకు కల్లూరు మండల తహసీల్దారు కార్యాలయం దగ్గర ఉన్నా కెనరా బ్యాంకు 3వ అంతస్తులో నిర్వహించేవారు. శిక్షణ కార్యక్రమాలను మరింత పెద్ద ఎత్తున చేపట్టాలనే లక్ష్యంతో బి.తాండ్రపాడు సమీపంలో డీఆర్‌డీఏ ట్రైనింగ్‌ సెంటరు పక్కన సొంత భవనాన్ని నిర్మించారు. 2024–25లో 35 బ్యాచ్‌లకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. ఒక్కో బ్యాచ్‌లో గరిష్టంగా 35 మంది ప్రకారం 1,225 మందికి శిక్షణ ఇచ్చారు. ఈ ఏడాది 44 బ్యాచ్‌లకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రణాళిక సిద్ధమైంది. ఒక బ్యాచ్‌కి శిక్షణ ఇవ్వాలంటే కెనరా బ్యాంకు రూ.2లక్షల వరకు భరిస్తోంది.

శిక్షణ ఇచ్చే అంశాలు పురుషులకు..

2వీలర్‌ మోటర్‌సైకిల్‌ సర్విసింగ్‌/రిపేరీ, సెల్‌పోన్‌ సర్వీసింగ్‌, ఫొటోగ్రఫీ –వీడియోగ్రఫీ, ఎలక్ట్రికల్‌ హోమ్‌ వైరింగ్‌, ప్లబింగ్‌–శానిటరీ, ఎలక్ట్రికల్‌ మోటర్‌ రీవైండింగ్‌– పంపుసెట్‌ రిపేరి, టైలరింగ్‌ అండ్‌ డ్రస్‌ డిజైనింగ్‌ ఫర్‌మెన్‌, సీసీటీవీ కెమెరా ఇన్టలేషన్‌, సరీసింగ్‌, కంప్యూటరైజ్డ్‌ అకౌంటింగ్‌(ట్యాలీ), పుట్టగొడుగుల తయారీ, గొర్రెల పెంపకంలో శిక్షణ ఇస్తారు. కొత్తగా 4 వీలర్‌ డ్రైవింగ్‌లో కూడా శిక్షణ ఇస్తున్నారు.

శిక్షణ ఇచ్చే అంశాలు మహిళలకు..

టైలరింగ్‌ అండ్‌ డ్రస్‌ డిజైనింగ్‌, బ్యూటీపార్లర్‌ మేనేజ్‌మెంటు/పెళ్లికూతురు మేకప్‌/మెహంది వర్క్‌, జ్యూట్‌బ్యాగ్‌ తయారీ/కూరగాయల బ్యాగుల తయారీ, వస్త్ర చిత్ర కళా ఉద్యమి(జర్దోషి, మగ్గం వర్క్‌, ఫ్యాబ్రిక్‌ పెయింట్స్‌), అగరుబత్తిల తయారీ, కొవ్వొత్తుల తయారీ కంప్యూటరైజ్డ్‌ అకౌంటింగ్‌(ట్యాలీ), పచ్చళ్లు, బేకరీ ఉత్పత్తులు, మసాల పౌడర్ల తయారీలో శిక్షణ ఇస్తారు.

బ్యాంకుల రుణాలు

గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతకు కెనరాబ్యాంకు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది. శిక్షణ ఇవ్వడంతో పాటు కేంద్ర ప్రభుత్వం తరఫున సర్టిఫికెట్‌ కూడా ఇస్తోంది. ఈ సర్టిఫికెట్‌తో బ్యాంకుల్లో రుణ సదుపాయం పొందవచ్చు. ఇప్పటి వరకు 354 బ్యాచ్‌లకు సంబంధించి 9342 మందికి శిక్షణ ఇచ్చారు. ఇందులో 6,671 మంది ఈ శిక్షణను సద్వినియోగం చేసుకోవడం ద్వారా జీవితంలో స్థిపనడ్డారు. 3,701 మందికి కెనరా బ్యాంకుతో పాటు బ్యాంకులు రుణ సదుపాయం కూడా కల్పించాయి.

‘పది’ చదివిన వారికి

అవకాశం

కెనరాబ్యాంకు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థతో ఉమ్మడి జిల్లా యూనిట్‌గా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. పూర్తిగా గ్రామీణ ప్రాంత యువతీ యువకులకే అవకాశం కల్పిస్తున్నాం. శిక్షణ పొందిన తర్వాత బ్యాంకుల నుంచి రుణాలు కూడా ఇప్పించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నాం. ఒక్కో ప్రోగ్రామ్‌లో 35 మందికి అవకాశం కల్పిస్తున్నాం. ప్రస్తుతం 10 తరగతి చదివిన వారికి మాత్రమే అవకాశం కల్పిస్తున్నాం.

– పుష్పక్‌కుమార్‌, డైరెక్టర్‌, కెనరాబ్యాంకు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థ, కర్నూలు

ఈ చిత్రంలో కనిపించే యువతి పేరు పి.హసీనా బేగం. కెనరా బ్యాంకు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో 30 రోజుల పాటు బ్యూటీపార్లర్‌లో శిక్షణ పొందారు. శిక్షణ పొందినట్లు సంస్థ సర్టిఫికెట్‌ కూడా ఇచ్చింది. శిక్షణ పొంది బ్యూటీ పార్లర్‌లో ఈమె జాబ్‌ చేస్తున్నారు.

క‘రుణ’ చూపుతూ.. ‘ఉపాధి’ కల్పిస్తూ..1
1/4

క‘రుణ’ చూపుతూ.. ‘ఉపాధి’ కల్పిస్తూ..

క‘రుణ’ చూపుతూ.. ‘ఉపాధి’ కల్పిస్తూ..2
2/4

క‘రుణ’ చూపుతూ.. ‘ఉపాధి’ కల్పిస్తూ..

క‘రుణ’ చూపుతూ.. ‘ఉపాధి’ కల్పిస్తూ..3
3/4

క‘రుణ’ చూపుతూ.. ‘ఉపాధి’ కల్పిస్తూ..

క‘రుణ’ చూపుతూ.. ‘ఉపాధి’ కల్పిస్తూ..4
4/4

క‘రుణ’ చూపుతూ.. ‘ఉపాధి’ కల్పిస్తూ..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement