వన్యప్రాణి మాంసం విక్రేతల అరెస్ట్‌ | Sakshi
Sakshi News home page

వన్యప్రాణి మాంసం విక్రేతల అరెస్ట్‌

Published Sun, May 12 2024 11:05 AM

వన్యప

మహానంది: మహానంది సమీపంలోని నల్లమల అడవిలో ఇటీవల వన్యప్రాణి మాంసం తరలిస్తున్న ఐదుగురిని అటవీశాఖ అధికారులు శనివారం అరెస్ట్‌ చేశారు. వారిని కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్‌కు ఆదేశించారు. నిందితుల్లో మహానందికి చెందిన శ్రీకాంత్‌, గుంటన్న, బయ్యన్న, కార్తీక్‌, సిద్ధయ్య ఉన్నారు. మరో ముగ్గురి కోసం గాలిస్తున్నట్లు డీఆర్‌ఓ హైమావతి తెలిపారు. ఇదిలా ఉండగా తమను మాత్రమే అరెస్ట్‌ చేసి ఒకరిని వదిలేశారని, పట్టుబడిన వారు, వారి బంధువులు మహానందిలో ఆందోళనకు దిగారు. ఐదుగురిని తరలిస్తున్న అటవీశాఖ జీపును అడ్డుకుని నిరసన తెలిపారు. అటవీశాఖ అధికారులు, పట్టుబడిన వారి బంధువుల మధ్య ఉద్రిక్తత నెలకొంది. ఎఫ్‌ఆర్‌ఓ దినేష్‌కుమార్‌రెడ్డి, సిబ్బంది విచారణ చేశారు. నేరానికి పాల్పడినవారిని మాత్రమే పట్టుకున్నామని అధికారులు వివరణ ఇచ్చారు.

ఒకరిని తప్పించారని పట్టుబడిన వారి

బంధువుల ఆందోళన

అటవీశాఖ అధికారుల జీపును

అడ్డుకుని నిరసన

వన్యప్రాణి మాంసం విక్రేతల అరెస్ట్‌
1/1

వన్యప్రాణి మాంసం విక్రేతల అరెస్ట్‌

 
Advertisement
 
Advertisement