వైద్య విద్యార్థులపై పోలీసుల తీరు దారుణం | - | Sakshi
Sakshi News home page

వైద్య విద్యార్థులపై పోలీసుల తీరు దారుణం

Jul 5 2025 9:30 AM | Updated on Jul 5 2025 9:30 AM

వైద్య విద్యార్థులపై  పోలీసుల తీరు దారుణం

వైద్య విద్యార్థులపై పోలీసుల తీరు దారుణం

లబ్బీపేట(విజయవాడతూర్పు): విదేశాల్లో వైద్య విద్యను పూర్తి చేసి, తమకు శాశ్వత రిజిస్ట్రేషన్‌ కల్పించాలని శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వైద్య విద్యార్థులను జట్టుపట్టుకుని పోలీసులు ఈడ్చుకుంటూ వెళ్లి అరెస్ట్‌ చేయడం దారుణమని వైఎస్సార్‌ సీపీ వైద్య విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్‌ మెహబూబ్‌ షేక్‌ అన్నారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో వైద్య విద్యను నిర్వీర్యం చేస్తూ వైద్య కళాశాలల నిర్మాణాలను నిలిపివేసిన చంద్రబాబు ప్రభుత్వం, విదేశాల్లో చదువుకున్న వారిపైన కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం దుర్మార్గం అన్నారు. రాష్ట్రంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో ప్రారంభించిన 17 వైద్య కళాశాలల నిర్మాణాలు పూర్తి చేస్తే ఇక్కడే వైద్య విద్యను అభ్యసించే అవకాశం లభిస్తుందన్నారు. అయితే వైద్య కళాశాలల నిర్మాణాలను నిలిపివేసి, ఎన్‌ఎంసీ మంజూరు చేసి సీట్లు కూడా వద్దని చెప్పిన కూటమి ప్రభుత్వం, కనీసం విదేశాల్లో చదువుకున్న వారిని సైతం ఇబ్బందులకు గురి చేస్తోందని మండిపడ్డారు. ‘సీఎం చంద్రబాబు కళాశాలలు ఏర్పాటు చేయరు, విదేశాల్లో చదువుకున్న వారికి పీఆర్‌ ఇవ్వరూ.. ఇదేం దాష్టికం’ అంటూ ప్రశ్నించారు. తక్షణమే ఎన్‌ఎంసీతో చర్చించి వారికి పీఆర్‌ ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు.

పుల్లేరులో యువకుడి మృతదేహం లభ్యం

ఉయ్యూరు: ఉయ్యూరు పరిధిలోని పుల్లేరు కాలువలో గల్లంతైన యువకుడి మృతదేహం శుక్రవారం లభ్యమైంది. ఉయ్యూరు పట్టణ పోలీసుల కథనం మేరకు రెల్లికాలనీకి చెందిన రావులపూడి సాయిచంద్రశేఖర్‌ (25) ఉయ్యూరు మున్సిపాలిటీలోని ప్రజారోగ్య విభాగంలో ఔట్‌ సోర్సింగ్‌ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఈ నెల 2వ తేదీన అర్ధరాత్రి ప్రమాదవశాత్తూ కాలుజారి పుల్లేరు కాలువలో గల్లంతయ్యాడు. స్థానికుడు నాని ఇచ్చిన సమాచారం మేరకు కుటుంబ సభ్యులు కాలువలో గాలింపు చేపట్టారు. మూడో వార్డు పరిధిలోని పుల్లేరు కాలువలో తూడులో చిక్కుకుని చంద్రశేఖర్‌ మృతదేహం లభ్యమైంది. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉయ్యూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడి తండ్రి రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ విశ్వనాథ్‌ తెలిపారు. కాగా చంద్రశేఖర్‌ మృతితో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

వైఎస్సార్‌ సీపీ వైద్య విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్‌ మెహబూబ్‌ షేక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement