విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో పాత ఇనుప సామగ్రి దగ్ధం | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో పాత ఇనుప సామగ్రి దగ్ధం

Jun 4 2025 1:25 AM | Updated on Jun 4 2025 1:25 AM

విద్య

విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో పాత ఇనుప సామగ్రి దగ్ధం

నందిగామ టౌన్‌: విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో జరిగిన అగ్ని ప్రమాదంలో పాత ఇనుప సామగ్రితోపాటు ఇల్లు దగ్ధమైంది. ఈ ఘటన నందిగామలో మంగళవారం జరిగింది. పట్టణంలోని యాదవ బజార్‌లో తమ్మిశెట్టి యలమందయ్య తన ఇంటి వద్దే పాత ఇనుప సామగ్రి వ్యాపారం చేస్తున్నారు. మంగళవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో విద్యుత్‌ మీటరు బోర్డులో షార్ట్‌ సర్క్యూట్‌ ఏర్పడి మంటలు ఎగిసిపడ్డాయి. మంటల కారణంగా విద్యుత్‌ తీగలు దగ్ధమవటంతో భవనం మొదటి అంతస్తులో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయి, దట్టంగా పొగలు కమ్మి, మంటలు ఎగసిపడటాన్ని గమనించారు. వెంటనే కిందకు వచ్చి అగ్నిమాపక శాఖాధికారులకు సమాచారం ఇచ్చారు. కంచికచర్ల అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైర్‌ ఇంజిన్లతో ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో సుమారు రూ.7 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు అగ్నిమాపక శాఖ సిబ్బంది నరసింహారావు తెలిపారు.

విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో పాత ఇనుప సామగ్రి దగ్ధం1
1/1

విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో పాత ఇనుప సామగ్రి దగ్ధం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement