ప్రభుత్వం దృష్టికి కాంట్రాక్ట్‌ ఉద్యోగుల సమస్యలు | Sakshi
Sakshi News home page

ప్రభుత్వం దృష్టికి కాంట్రాక్ట్‌ ఉద్యోగుల సమస్యలు

Published Fri, Nov 17 2023 1:42 AM

- - Sakshi

గాంధీనగర్‌ (విజయవాడసెంట్రల్‌): కాంట్రాక్ట్‌ అవుట్‌ సోర్సింగ్‌ ఎంప్లాయీస్‌ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖరరెడ్డి అన్నారు. విజయవాడలోని హనుమంతరాయ గ్రంథాలయంలో గురువారం ఆంధ్రప్రదేశ్‌ కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ సర్వీసెస్‌ ఎంప్లాయీస్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహించారు. అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు లంకా మణికంఠ మాట్లాడుతూ కాంట్రాక్ట్‌ అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు పీఆర్‌సీ పునరుద్ధరించాలని కోరారు. కాంట్రాక్ట్‌ ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌ జీవోను సత్వరమే అమలు చేయాలని కోరారు. అసోసియేషన్‌ నాయకులు శ్రీరామ్‌ రమేష్‌, మస్తాన్‌, గిరి, వేణు తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖరరెడ్డి

Advertisement
Advertisement