
మహిళల ఆర్థికాభివృద్ధికి రుణ సదుపాయం
● అదనపు కలెక్టర్ దీపక్ తివారి
ఆసిఫాబాద్‌రూరల్: రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆర్థికాభివృద్ధికి రుణ సదుపాయం కల్పిస్తోందని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో శుక్రవారం వివిధ శాఖల అధి కారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆ యన మాట్లాడుతూ జిల్లాలోని స్వయం సహాయక సంఘాల సభ్యులకు రుణాలు మంజూరు చేసి, వారి ఆర్థికాభిృద్ధికి తోడ్పాటు అందిస్తున్నామన్నా రు. జిల్లాలో స్వయం సహాయక సంఘాల బ్యాంకు లింకేజీ 170 లక్ష్యం కాగా, ఇప్పటివరకు 12 వారు లింకేజీ పూర్తిగా చేశారని తెలిపారు. మిగిలిన 158 సంఘాలకు సంబంధించిన ప్రక్రియ కూడా త్వరగా చేపట్టాలన్నారు. కొత్తగా వివాహమైన వారిని గ్రూ పుల్లో సభ్యులుగా చేర్పించి, నూతన సంఘాలు ఏ ర్పాటు చేయాలన్నారు. ప్రధాన మంత్రి స్వనిధి, స మృద్ధి నిధి, విశ్వకర్మ పథకాలపై అవగాహన కల్పించాలని సూచించారు. ఈ సమావేశంలో మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ మోతీరాం, డీటీడీవో రమాదేవి, అదనపు డీఆర్‌డీవో రామకృష్ణ, డీపీఎంలు తదితరులు పాల్గొన్నారు.