
103 శాతం బొగ్గు ఉత్పత్తి
ఐదు ఏరియాల్లో 100 శాతం
సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి సంస్థ 2025–26 ఆర్థిక సంవత్సరంలో 76 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో మే నెలలో సింగరేణి వ్యాప్తంగా ఉన్న 11ఏరియాల్లోని 19 ఓ పెన్కాస్ట్ గనులకు, 21భూగర్భ గనులకు 56.50 మిలి యన్ లక్షలటన్నుల లక్ష్యానికి 58.22 లక్షల టన్ను లు 103 శాతం మాత్రమే సాధించినట్లు సింగరేణి తన గణాంకాల్లో తెలిపింది. కాగా సింగరేణి వ్యాప్తంగా ఉన్న 11ఏరియాల్లోని భూగర్భగనుల్లో 4.90లక్షల టన్నుల లక్ష్యానికి 3.50లక్షల టన్నులు 72శాతం ఉత్పత్తి చేయగా, ఓపెన్ కాస్ట్ గనుల్లో 51.60 లక్షల టన్నులకు గాను 54.72 లక్షల టన్నులు 106 శాతం సాధించింది. ఓవరాల్గా 56.50 లక్షల టన్నుల లక్ష్యానికి 58.22లక్షల టన్నులు 103శాతం ఉత్పత్తి జరిగింది.
మే మాసంలో మెరుగైన ఉత్పత్తి...
గడచిన ఏప్రిల్లో సాధించిన ఉత్పత్తి (95శాతం) కంటే మే లో 103 శాతం అంటే 8 శాతం (నెలవారీ ఉత్పత్తి) అదనంగా ఉత్పత్తి జరిగింది. అంతేకాకుండా ఏప్రిల్లో మణుగూరు ఏరియా 10.88 లక్షల టన్నులు సాధించి మొదటి స్థానంలో నిలవగా, ఆర్జీ–2 ఏరియా 4.99 లక్షల టన్నులు సాధించి రెండో స్థానంలో నిలిచింది. మే నెలలో 5 ఏరియాలు (కొత్తగూడెం 107 శాతం, మణుగూరు 119 శాతం, శ్రీరాంపూర్ 100 శాతం, ఆర్జీ–2 133 శాతం, ఆర్జీ–3 100 శాతం,) 100 శాతం సాధించాయి. సింగరేణి వ్యాప్తంగా 11 ఏరియాల్లోని భూగర్భ గనులు, ఓపెన్ కాస్ట్ గనుల్లో 49.90 లక్షల టన్నులు 95 శాతం సాధించగా, మే లో 10.81 లక్షల టన్నులు 99శాతం అంటే గతంలో కంటే మరో 4శాతం అదనంగా సాధించింది.
తీరు మార్చుకోని ఆరు ఏరియాలు..
సింగరేణి వ్యాప్తంగా ఉన్న 11 ఏరియాల్లో మే మాసంలో ఐదు ఏరియాలు మాత్రమే 100 శాతం ఉత్పత్తి సాధించగా, మిగిలిన ఆరు ఏరియాలు వెనుకంజలో ఉన్నాయి. అయితే సింగరేణి సంస్థ ఉన్నతాధికారులు ఏరియాలలోని భూగర్భ, ఓపెన్ కాస్ట్ గనులకు నిర్దేశించిన నెలవారి, వార్షిక లక్ష్యాలను కచ్చితంగా సాధించాలని రివ్యూ మీటింగ్లలో పలుమార్లు చెప్పినప్పటికీ అధికారుల పనీతీరులో మార్పు రాలేదు.
లక్ష్యంసాధించిన
కొత్తగూడెం మణుగూరు, ఆర్జీ–2...
మే మాసంలో కొత్తగూడెం ఏరియా 107శాతం, వార్షిక లక్ష్యం 100శాతం సాధించగా, మణుగూరు ఏరియా మే నెలలో 119శాతం, వార్షిక లక్ష్యంలో 118శాతం సాధించినప్పటికీ ఓవరాల్గా కొత్తగూడెం ఏరియా 13.96 లక్షల టన్నులు, వార్షిక లక్ష్యం 26.04 లక్షల టన్నులు సాధించి సింగరేణి వ్యాప్తంగా అగ్రస్థానంలో ఉండగా, మణుగూరు ఏరియా మేలో 11.74 లక్షల టన్నులు, వార్షిక లక్ష్యంలో 22.63 లక్షల టన్నులు సాధించి రెండో స్థానంలో నిలిచాయి. కంపెనీ రెండు నెలలో 108 లక్షల్లో కొత్తగూడెం రీజియన్ 53 లక్షలు సాధించటం విశేషం. అయితే మిగతా రెండు రీజియన్లు 55 లక్షల టన్నులు సాధించటం గమనార్హం. కాగా, ఆర్జీ–2 ఏరియా మే నెలలో 133 శాతం, రెండు నెలలో 159 శాతం సాధించి మూడు స్థానంలో ఉంది.