
ఆకట్టుకున్న శకటాలు
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సంబంధించి రూపొందించిన శకటాలు, స్టాళ్లు ఆకట్టుకున్నాయి. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఖమ్మం పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన వేడుకల్లో రవాణాశాఖ (మహాలక్ష్మి) బస్సు శకటం, పౌర సరఫరాల శాఖ ద్వారా ఉచిత బియ్యం పంపిణీ, ధాన్యం కొనుగోళ్లు, గృహ నిర్మాణ శాఖ శకటం ఇందిరమ్మ ఇంటి నమూనాతో రూపొందించిన శకటాలను ప్రదర్శించారు. వీటితో పాటు సంక్షేమ శాఖలు, రవాణా శాఖ, పర్యాటక శాఖల శకటాలు సైతం ఆకట్టుకున్నాయి. అంతేకాక వైద్య ఆరోగ్యశాఖ, డీఆర్‌డీఏ, విద్యుత్ తదితర శాఖల ద్వారా అమలవుతున్న పథకాలతో స్టాళ్లు ఏర్పాటు చేశారు. కాగా, వేడుకల్లో వివిధ పాఠశాలల విద్యార్థులు ఇచ్చిన ప్రదర్శనలు అలరించాయి.
– ఖమ్మం సహకారనగర్

ఆకట్టుకున్న శకటాలు

ఆకట్టుకున్న శకటాలు