అనుమతులు లేని లేఔట్ల పరిశీలన | - | Sakshi
Sakshi News home page

అనుమతులు లేని లేఔట్ల పరిశీలన

May 31 2025 12:26 AM | Updated on May 31 2025 12:26 AM

అనుమత

అనుమతులు లేని లేఔట్ల పరిశీలన

సత్తుపల్లి: సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలో అనుమతులు లేకుండా వేసిన లే ఔట్లను గుర్తిస్తున్నట్లు టీపీబీఓ కె.రాజు తెలిపారు. ‘సాక్షి’లో శుక్రవారం ‘రియల్‌’ దందా..’ శీర్షికన ప్రచురితమైన కథనంతో కమిషనర్‌ కె.నర్సింహ స్పందించారు. ఆయన ఆదేశాలతో టీపీబీఓ రాజు పలు వెంచర్లను తనిఖీ చేశారు. సత్తుపల్లిలోని అయ్యగారిపేట, కొమ్మేపల్లి కాలనీ సమీపాన రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లను పరిశీలించి అనుమతులపై ఆరా తీశారు. అనుమతి లేని వెంచర్లకు సంబంధించి అధికారులకు నివేదిక ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు.

పోక్సో కేసు నమోదు

చింతకాని: మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికను అదే గ్రామానికి చెందిన వ్యక్తి శుక్రవారం వేధించాడు. ఆమెను మానసికంగా, శారీరకంగా వేధించినట్లు బాధితురాలి తల్లి ఫిర్యాదు చేయగా పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఎస్సై నాగుల్‌మీరా తెలిపారు.

అనుమతులు లేని  లేఔట్ల పరిశీలన
1
1/1

అనుమతులు లేని లేఔట్ల పరిశీలన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement