త్యాగానికి ప్రతీక బక్రీద్‌ | - | Sakshi
Sakshi News home page

త్యాగానికి ప్రతీక బక్రీద్‌

Jun 8 2025 12:42 AM | Updated on Jun 8 2025 12:56 AM

సాక్షి,బళ్లారి: త్యాగ, బలిదానాలకు ప్రతీకగా నిలిచిన బక్రీద్‌ పండుగను ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. శనివారం బక్రీద్‌ పర్వదినాన్ని పురస్కరించుకొని నగరంలో ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో చేరి ఈద్గాల్లో సామూహిక ప్రార్థనలు చేశారు. రంజాన్‌ పండుగ తర్వాత గొప్పగా జరుపుకునే పండుగల్లో ఒక్కటైన బక్రీద్‌ పండుగకు ముస్లిం సోదరులకు ఓ ప్రత్యేకత ఉంది. ఈ నేపథ్యంలో పండుగ రోజున ఈద్గా, మసీదుల్లో సామూహిక ప్రార్థనలు చేసుకొని పొట్టేళ్లు బలి ఇచ్చి అందరికీ మంచి జరగాలని భక్తిశ్రద్ధలతో పండుగను ఆచరించారు. నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా ముస్లిం సోదరులు ఆయా మసీదులు, ఈద్గాల్లో ప్రార్థనలు చేసి భక్తిని చాటుకున్నారు. కొత్త బట్టలు ధరించి ఉత్సాహంగా బక్రీద్‌ను ఆచరించారు. అనంతరం కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి పండుగ భోజనాలను ఆరగించారు.

ఎంపీ, ఎమ్మెల్యే శుభాకాంక్షలు

రాజ్యసభ సభ్యుడు నాసీర్‌ హుస్సేన్‌, నగర ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి తదితరులు ఈద్గా వద్ద ముస్లిం సోదరులకు బక్రీద్‌ శుభాకాంక్షలు తెలియజేశారు. ముస్లిం ధర్మ గురువు సమక్షంలో ఈద్గాల్లో భక్తిశ్రద్ధలతో సామూహిక ప్రార్థనలు చేయడంతో ఈద్గాలు, మసీదులు ముస్లిం సోదరులతో కిటకిటలాడాయి. పెద్ద సంఖ్యలో జనం చేరి సామూహిక ప్రార్థనలు చేయడంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ముస్లిం సోదరులు ఒకరినొకరు అలింగనం చేసుకొని బక్రీద్‌ శుభాకాంక్షలు తెలుపుకొని సంతోషంగా పండుగను ఆచరించారు.

ప్రశాంతంగా బక్రీద్‌ పండుగ

రాయచూరు రూరల్‌: నగరంలో బక్రీద్‌ పండుగను ముస్లిం సోదరులు ప్రశాంతంగా జరుపుకున్నారు. శనివారం ఈద్గా మైదానం, ఏక్‌ మినార్‌ మసీదులో ముస్లిం సోదరులు మసీదు నిర్వాహకులు ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. చిన్నారులు ఒకరినొకరు ఆలింగనం చేసుకోవడం కనిపించింది.

ఉత్సాహంగా బక్రీద్‌ ఆచరణ

హొసపేటె: త్యాగ బలిదానాలకు ప్రతీక అయిన బక్రీద్‌ పండుగను ముస్లిం సోదరులు శనివారం ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు. నగరంలోని ఈద్గా మైదానంలో ఉదయం సామూహిక ప్రార్థనలు చేసి ముస్లిం సోదరులు, పిల్లలు ఒకరినొకరు కౌగలించుకుని ఈద్‌ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. తర్వాత ప్రతి ఇంట్లో దేవుడి పేరు మీద గొర్రెలను బలి ఇచ్చారు. బక్రీద్‌ పండుగ ఆచారం ప్రకారం మాంసంలో కొంత భాగాన్ని బంధువులకు, మరి కొంత భాగాన్ని పేదలకు దానం చేశారు. మరికొందరు మాంసాన్ని వండి పేదలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మహమ్మద్‌ అబూబక్కర్‌, ఫిరోజ్‌ఖాన్‌, అన్వర్‌ బాషా, ఇమామ్‌ నియాజీ, వందలాది మంది సోదరులు పాల్గొన్నారు.

ఈద్గాల్లో సామూహికంగా ప్రార్థనలు

వాడవాడలా భక్తిశ్రద్ధలతో పండుగ

త్యాగానికి ప్రతీక బక్రీద్‌ 1
1/3

త్యాగానికి ప్రతీక బక్రీద్‌

త్యాగానికి ప్రతీక బక్రీద్‌ 2
2/3

త్యాగానికి ప్రతీక బక్రీద్‌

త్యాగానికి ప్రతీక బక్రీద్‌ 3
3/3

త్యాగానికి ప్రతీక బక్రీద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement