
ఉద్యోగ విరమణ సహజం
రాయచూరు రూరల్: ఉద్యోగంలో పదవీ విరమణ సహజమని టాగూర్ స్మారక విద్యా మండలి అధ్యక్షుడు అమరేష్ అభిప్రాయపడ్డారు. శనివారం టాగూర్ స్మారక విద్యా సంస్థ కళాశాలలో పదవీ విరమణ చేిసిన ప్రిన్సిపాల్ శ్రీనివాస రాయచూరుకర్‌ను సన్మానించి వీడ్కోలు పలికి మాట్లాడారు. విద్యార్థులకు ఉత్తమ బోధనలతో పాటు గ్రామాల్లో ఎలా సమాజ సేవ చేయాలో నేర్పిన వ్యక్తిగా కొనియాడారు. మండలి పదాధికారులు శివబసప్ప మాలి పాటిల్, విరుపాక్షప్ప, శాంతప్ప, పంపనగౌడ, నిర్మల, హేమరెడ్డి, నాగభూషణ్, రాజేశ్వరి, విజయ్ కుమార్, అళ్లప్ప, వెంకటేష్, దేవిరెడ్డి, చెన్నమల్లికార్జున, వీరప్ప, కల్లయ్యలున్నారు.