
ఆయకట్టుకు అందని నీరు.. ఎండుతున్న వరి పైరు
రాయచూరు రూరల్: తుంగభద్ర ఎడమ కాలువ చివరి ఆయకట్టుకు సక్రమంగా సాగునీరందక పోవడంతో జిల్లాలో వరి పైరు వాడిపోతోంది. జూలై 10న కాలువకు నీరు విడుదల చేసినా మస్కి వద్ద కాలువ పైభాగంలో శనివారం రోజు పెద్ద బండరాళ్లు విరిగి పడ్డాయి. పైగా అక్రమ నీటి వినియోగంతో కాలువలో నీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడింది. జిల్లాలోని మాన్వి, సిరవార, రాయచూరు తాలూకాల రైతులు పలు విధాలుగా నష్టపోయే ప్రమాదం పొంచి ఉంది. వరి నాట్లు వేసి రెండు నెలలు కావస్తున్న తరుణంలో వరి పైరుకు నీరు అవసరమున్న సమయంలో నీటిపారుదల శాఖాధికారులు నీటి విడుదలకు చొరవ చూపక పోవడంపై రైతులు అధికారులు, ప్రజాప్రతినిధులపై శాపనార్థాలు పెడుతున్నారు. మూడు తాలూకాల్లో దాదాపు ఆరు లక్షల ఎకరాల్లో వరి పైరు వేశారు.
రైతులకు పరిహారం అందించాలి
ఆయకట్టు పరిధిలో భూముల్లో రైతులు వేసుకున్న పంటలు ఎండిపోతున్నాయని రైతు సంఘం జిల్లాధ్యక్షుడు లక్ష్మణ్‌గౌడ ఓ ప్రకటనలో ఆరోపించారు. రైతులకు ప్రభుత్వం పంట నష్ట పరిహారం అందించాలని ఒత్తిడి చేశారు. తుంగభద్ర డ్యాంలో పుష్కలంగా నీరున్నా కాలువలకు సక్రమంగా నీరు వదలకపోవడం సరికాదన్నారు. ఆయకట్టు చివరి భూములకు నీరు అందించడంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు విఫలమయ్యారని మండిపడ్డారు.
అక్రమ నీటి వినియోగంతో ఆటంకం
పట్టించుకోని అధికారులు, పాలకులు

ఆయకట్టుకు అందని నీరు.. ఎండుతున్న వరి పైరు

ఆయకట్టుకు అందని నీరు.. ఎండుతున్న వరి పైరు