
ఉపసంహరించుకోవాలి
పాఠశాలల పర్యవేక్షణ బాధ్యతను ఎస్జీటీలు, ఎల్‌ఎఫ్‌ఎల్‌హెచ్‌ఎంలు, స్కూల్ అసిస్టెంట్లకు అప్పగించడాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలి. ఈ ఉత్తర్వుల వల్ల ఉపాధ్యాయుల కొరత ఏర్పడి విద్యా ప్రమాణాలు మరింత దిగజారుతాయి. ఉపాధ్యాయుల మధ్య తగువులకు దారితీసి పాఠశాల వాతావరణం కలుషితమవుతుంది.
– ఎ.తిరుపతిరావు,
తపస్ జిల్లా ప్రధాన కార్యదర్శి
ఉన్నతాధికారులను నియమించాలి
పాఠశాలలో పర్యవేక్షణ చేసి బోధన మెరుగుపరచాలనే విధానం మంచిదే. కానీ, ఉపాధ్యాయులను బోధనకు దూరం చేసి పర్యవేక్షణకు నియమించాలనుకోవడం సరికాదు. పాఠశాలల పర్యవేక్షణకు ఉన్నతాధికారులను నియమిస్తేనే బాగుంటుంది.
– పీఆర్ శ్రీనివాస్,
ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి

ఉపసంహరించుకోవాలి