అనాథకు అంత్యక్రియలు | - | Sakshi
Sakshi News home page

అనాథకు అంత్యక్రియలు

Jun 9 2025 12:05 AM | Updated on Jun 9 2025 12:05 AM

అనాథకు అంత్యక్రియలు

అనాథకు అంత్యక్రియలు

రామడుగు(చొప్పదండి): మండలంలోని వెలిచాల గ్రామ శివారులోని స్పందన అనాథ వృద్ధుల ఆశ్రమ నిర్వాహకుల ఆధ్వర్యంలో అనాథ సిద్దం రాములు మృతదేహానికి ఆదివారం అంత్యక్రియలు నిర్వహించారు. పెద్దపల్లి సమీపంలో చెట్లకింద నివాసం ఉంటున్న వృద్ధుడు రాములు అనారోగ్యంతో ఉన్నాడని సమాచారం రావడంతో స్పందన ఆశ్రమ నిర్వాహకులు మంచికట్ల శ్రీనివాస్‌ అతన్ని తీసుకవచ్చి ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స చేయిస్తుండగా, ఆదివారం వేకువజామున మృతిచెందాడు. మృతదేహానికి వెలిచాల శివారులోని శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. ఆశ్రమ నిర్వాహకులు కల్యాణ్‌, రాజు, మల్లేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement