బడి బస్సులు పదిలమేనా? | - | Sakshi
Sakshi News home page

బడి బస్సులు పదిలమేనా?

Jun 7 2025 1:04 AM | Updated on Jun 7 2025 1:04 AM

బడి బస్సులు పదిలమేనా?

బడి బస్సులు పదిలమేనా?

జిల్లాలో 253 స్కూల్‌ బస్సులు

120 బస్సులకే ఫిట్‌నెస్‌ పరీక్షలు పూర్తి

12 తర్వాత స్పెషల్‌ డ్రైవ్‌

నిర్వహిస్తామంటున్న

రవాణా శాఖ అధికారులు

ఎల్లారెడ్డి: వేసవి సెలవులు ముగింపునకు వస్తున్నాయి. మరో వారం రోజుల్లో పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. దీంతో ప్రైవేట్‌ పాఠశాలలు విద్యార్థుల రవాణాకు ఉపయోగించే బస్సులకు సామర్థ్య పరీక్షలు నిర్వహించి, రవాణాశాఖ నుంచి ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లు పొందే ప్రక్రియలో బిజీగా ఉన్నాయి. జిల్లాలో అన్ని ప్రైవేట్‌ పాఠశాలలకు కలిపి 253 వాహనాలు ఉన్నాయి. ఈ వాహనాలను ఏటా ఆయా పాఠశాలల యాజమాన్యాలు ఫిట్‌నెస్‌ పరీక్షలు చేయించాల్సి ఉంటుంది. అయితే ఇప్పటివరకు 120 బస్సుల ఫిట్‌నెస్‌ పరీక్షలు మాత్రమే పూర్తయ్యాయి. మిగిలిన పాఠశాలలు సైతం తమ బస్సులకు ఫిట్‌నెస్‌ పరీక్షలు చేయించుకోవాలని రవాణా శాఖ అధికారులు సూచిస్తున్నారు.

తమ పిల్లలను స్కూల్‌ బస్సులలో పంపించే తల్లిదండ్రులు కూడా ఆయా బస్సులకు సంబంధించిన ఫిట్‌నెస్‌ పత్రాలను, డ్రైవర్‌ పరిస్థితిని గమనించడం మంచిదని పేర్కొంటున్నారు. ఫిట్‌నెస్‌ లేకపోయినా, వేరే వ్యక్తులు బస్సు నడుపుతున్నా వెంటనే రవాణా శాఖ అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు.

ఫిట్‌నెస్‌ నిబంధనలు..

పాఠశాల వాహనాలు తప్పనిసరిగా పూర్తి కండిషన్‌లో ఉండాలి.

15 ఏళ్ల జీవితకాలం పూర్తయిన వాహనాల ను విద్యార్థుల రవాణాకు వినియోగించరాదు.

పాఠశాల వాహనాలకు ముందువైపు ఎడ మ పక్కన పాఠశాల వివరాలు అందరికీ క నిపించేలా రాయించాలి. విద్యాసంస్థ పే రు, యాజమాన్య ప్రతినిధుల సెల్‌ నంబ ర్‌, పాఠశాల పూర్తి చిరునామా ఈ వివరా ల్లో స్పష్టంగా ఉండాలి.

వాహనాల డ్రైవర్ల ఆరోగ్య వివరాలను యాజమానం తమ వద్ద కలిగి ఉండాలి.

డ్రైవర్‌ బీపీ, షుగర్‌, కంటి చూపు సామర్థ్యానికి సంబంధించిన వివరాలు క్వాలిఫైడ్‌ డాక్టర్లతో ప్రతి మూడు నెలలకోమారు చెక్‌ చేయించాలి.

పాఠశాల వాహనాల డ్రైవర్లకు కనీసం ఐదే ళ్ల అనుభవం ఉండాలి.

వాహనాలకు తప్పనిసరిగా అత్యవసర ద్వారం ఉండాలి. దానిపై అత్యవసర ద్వారం అని స్పష్టంగా రాసి ఉండాలి.

వాహనానికి సంబంధించి విండ్‌ స్క్రీన్‌, వై పర్స్‌, లైటింగ్‌, పార్కింగ్‌ లైట్లు సమర్థవంతంగా పనిచేసేలా చూసుకోవాలి.

వాహనాల టైర్లు మంచి సామర్థ్యం కలిగిన వి ఉండాలి.

వాహనంలో అగ్నిమాపక పరికరాలు త ప్పనిసరిగా ఉండాలి.

ఫస్ట్‌ ఎయిడ్‌ బాక్స్‌ కూడా ఉండాలి.

వాహనం ఫుట్‌బోర్డు మొదటి మెట్టు భూ మి నుంచి 325 మిల్లీమీటర్ల ఎత్తు మించ కుండా ఉండాలి. మెట్లు జారకుండా ఏ ర్పాటు చేయించాలి

ప్రతి బస్సుకు ఒక అటెండర్‌ తప్పనిసరి.

బస్సులో ప్రయాణించేవారి వివరాలు కూ డా అందుబాటులో ఉండాలి.

వాహనంలో స్కూల్‌ బ్యాగులు పెట్టుకునేందుకు షెల్ఫ్‌లు ఏర్పాటు చేయాలి.

కిటికీలకు మధ్యలో ఇనుప కడ్డీలు తప్పనిసరిగా ఏర్పాటు చేయించాలి.

ఫిట్‌నెస్‌ లేకపోతే సీజ్‌ చేస్తాం

పాఠశాలలు ప్రారంభమయ్యేలోగా స్కూల్‌ బ స్సుల ఫిట్‌నెస్‌ పరీక్షలు పూర్తి చేయించుకో వాలని పాఠశాలలకు నోటీసులు ఇచ్చాం. జి ల్లాలో 253 స్కూల్‌ బస్సులు ఉండగా ఇప్పటి వరకు 120 బస్సులకు ఫిట్‌నెస్‌ పరీక్షలు పూర్తయ్యాయి. మిగతా వాటికి కూడా ఫిట్‌నెస్‌ పరీక్ష లు చేయించుకోవాలి. ఈనెల 12 నుంచి స్పెషల్‌ డ్రైవ్‌లు నిర్వహిస్తాం. ఫిట్‌నెస్‌లేని బస్సులు కనిపిస్తే సీజ్‌ చేస్తాం. – శ్రీనివాస్‌రెడ్డి,

జిల్లా రవాణాశాఖ అధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement