మధ్యలో నిలిపేస్తే ఎలా..? | - | Sakshi
Sakshi News home page

మధ్యలో నిలిపేస్తే ఎలా..?

Jul 5 2025 6:32 AM | Updated on Jul 5 2025 6:32 AM

మధ్యల

మధ్యలో నిలిపేస్తే ఎలా..?

కొన్నేళ్ల క్రితం గొంతుకు శస్త్రచికిత్స అయ్యింది. అందుకే ఎక్కువ సేపు రైలులో ఉండలేనందున బస్సుకు వెళ్దామని పోతున్న. రైళ్ల రాకపోకలు ఇబ్బంది కలిగినప్పుడు బస్సు సౌకర్యం కల్పిస్తే బాగుంటది. ఇలా మధ్యలో రైళ్లు నిలిపివేస్తే ఎలా.?

– శివమూర్తి, కర్నూలు

ఎంతసేపు ఉండాలో..

భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి హైదరాబాద్‌ నుంచి కర్నూలు బయలుదేరా. రైలు ఇక్కడ ఆపారు. ఏం జరిగిందో.. ఎందుకు ఆపారో తెలియక చాలాచేసు ఇబ్బంది పడ్డాం. గూడ్స్‌ పట్టాలు తప్పిందని ఇప్పుడే తెలుసుకున్నాం. ఇంకా ఎంతసేపు ఉండాలో తెలియడం లేదు. చిన్నపాప ఉన్నందున నా భార్య చీరతో ఊయల కట్టి పడుకోబెట్టాం. ప్రమాదాలు జరిగినప్పుడు అందుకు తగినట్లుగా రైల్వే శాఖ ఏర్పాట్లు చేస్తే బాగుంటుంది.

– అమర్‌నాథ్‌, కర్నూలు

మన్యంకొండ వెళ్తున్నాం..

నేను నా భార్యాపిల్లలతో కలిసి మన్యంకొండ వేంకటేశ్వరస్వామి దర్శించుకునేందుకు రాయచూర్‌ డెమోకు వచ్చాం. 6.50 గంటల నుంచి ఇక్కడే నిలిపివేశారు. రాత్రికి ఎప్పుడు వెళ్తుందో తెలియని పరిస్థితి. నా పిల్లలు నేను ఏమి తినాలో ఇబ్బంది పడుతున్నాం. ఇక్కడ ఏమీ దొరకడం లేదు.

– నర్సింహ, గద్వాల

నేను బద్వేల్‌ వెళ్లాలి

నేను బద్వేల్‌ వెళ్లేందుకు మా అన్న, అమ్మతో కలిసి రాయచూర్‌ డెమో ఎక్కాం. దాదాపు 2 గంటల నుంచి ఇక్కడే నిలిపివేశారు. ఎప్పుడు వెళ్తుందో అధికారులు చెప్పడం లేదు. మాకు తినడానికి రాత్రిపూట ఏమీ సౌకర్యాలు లేవు. ఏం చేయాలో దిక్కు తోచడం లేదు.

– సత్యనారాయణశెట్టి,

రాయచూర్‌

మధ్యలో నిలిపేస్తే ఎలా..? 
1
1/3

మధ్యలో నిలిపేస్తే ఎలా..?

మధ్యలో నిలిపేస్తే ఎలా..? 
2
2/3

మధ్యలో నిలిపేస్తే ఎలా..?

మధ్యలో నిలిపేస్తే ఎలా..? 
3
3/3

మధ్యలో నిలిపేస్తే ఎలా..?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement