
సమావేశంలో మాట్లాడుతున్న శ్రీనివాసరావు
టేకుమట్ల(రేగొండ): వెనకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయడంలో ప్రభుత్వం విఫలమైందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు శ్రీనివాసరావు అన్నారు. గురువారం రేగొండ మండలంలో ఏర్పాటుచేసిన సీపీఐ ప్రజాపోరు యాత్రలో ఆయన మాట్లాడారు. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ, ములుగులో గిరిజన యూనివర్సిటీ, కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ తెస్తామని చెప్పిన నేతలు వాటి ఏర్పాటుకు ఇప్పటి వరకు కృషి చేయడం లేదన్నారు. ఉమ్మడి వరంగల్‌లో ఏర్పడిన కొత్త జిల్లాల్లో అభివృద్ధి జరగడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పటికై నా అభివృద్ధిపై పాలకులు దృష్టి పెట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు విజయ్‌సారథి, కర్రె భిక్షపతి, మేకల రవి, మల్లికార్జున్‌రావు, రాష్ట్ర కమిటీ సభ్యులు నేతులూరి జ్యోతి, మండల నాయకులు పెంట రవి, మామిడాల సమ్మిరెడ్డి, అన్నారపు రాజేందర్, ఫైల్ల శాంతికుమార్, గుర్రాల రవీందర్ పాల్గొన్నారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు శ్రీనివాసరావు