
సైకిళ్లు, కుట్టుమిషన్లు, టీషర్టులు అందజేస్తూ..
కాటారం: ప్రజల్లో మమేకమై నిరుపేదలకు సేవ చేయడమే లక్ష్యంగా సీఆర్పీఎఫ్, పోలీస్‌శాఖ ముందుకెళ్తుందని కాటారం డీఎస్పీ రామ్మోహన్‌రెడ్డి అన్నారు. జి 58 సీఆర్పీఎఫ్ బెటాలియన్ ఆధ్వర్యంలో మండలకేంద్రంలోని పోలీస్‌స్టేషన్ ఆవరణలో సివిక్ యాక్షన్ ప్రోగ్రాం నిర్వహించారు. ఇందులో భాగంగా దివ్యాంగులకు ట్రై సైకిళ్లు, క్రీడాకారులకు టీషర్ట్స్, నిరుపేద మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీచేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ప్రతి ఏడాది సివిక్ యాక్షన్ ప్రోగ్రాంలో భాగంగా సీఆర్పీఎఫ్ ఆధ్వర్యంలో గ్రామాల్లోని నిరుపేదలకు చేయూతనందిస్తున్నట్లు తెలిపారు. పోలీసులు శాంతిభద్రతల పరిరక్షణతో పాటు సమాజసేవలో ముందుంటూ ప్రజలకు ఏదో విధంగా సహాయ సహకారాలు అందిస్తున్నట్లు చెప్పారు. ప్రజలు అసాంఘిక శక్తులకు, అసాంఘిక కార్యక్రమాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీఆర్పీఎఫ్ బెటాలియన్ డీఎస్పీ కోమల్ ప్రీత్‌కౌర్, కాటారం సీఐ రంజిత్‌రావు, ఎస్సై శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు.
కాటారం డీఎస్పీ రామ్మోహన్‌రెడ్డి