
టేకుమట్ల(రేగొండ): రేగొండ మండలంలోని కోటంచ శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బుధవారం ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సిరికొండ స్వగ్రామమైన పరకాల మండలంలోని నర్సక్కపల్లి నుంచి కోటంచ ఆలయానికి ర్యాలీగా వచ్చి మొక్కులు చెల్లించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోరిక కోర్కెలు తీర్చే కొంగుబంగారం శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని హామీఇచ్చారు.అనంతరం ఆయనను నాయకులు గజమాలతో ఘనంగా సన్మానించారు. బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు కత్తి సంపత్, వావిలాల రమేష్, గునిగంటి మహేందర్, తదితరులు ఉన్నారు.