అర్హులు 72 మంది | Sakshi
Sakshi News home page

అర్హులు 72 మంది

Published Tue, Nov 14 2023 1:18 AM

జనగామ ఆర్‌ఓ కార్యాలయంలో 
నామినేషన్‌ పత్రాలను పరిశీలిస్తున్న అధికారులు  - Sakshi

జిల్లా పరిధి నియోజకవర్గాల్లో

నామినేషన్ల స్క్రూటినీ అనంతరం వివరాలు

నియోజకవర్గం నామినేషన్లు తిరస్కరణ అర్హత

జనగామ 32 05 27

స్టేషన్‌ఘన్‌పూర్‌ 28 05 23

పాలకుర్తి 39 17 22

మొత్తం 99 27 72

జనగామ: జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల స్క్రూటినీ(పరిశీలన) సోమవారం ముగిసింది. జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్‌, పాలకుర్తి నియోజకవర్గ కేంద్రాల్లోని కార్యాలయాల్లో ఎన్నికల రిటర్నింగ్‌ అధికా రులు మురళీకృష్ణ రామ్మూర్తి, రోహిత్‌సింగ్‌, ఎన్నిక ల జనరల్‌, పోలీస్‌ అబ్జర్వర్ల ఆధ్వర్యంలో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అభ్యర్థులు, పోలింగ్‌ ఏజెంట్లు, ప్రతిపాదితుల సమక్షంలో నామినేషన్‌ పత్రాలను పరిశీలించారు. జిల్లాలో మొత్తం 99 నామినేషన్లు రాగా 27 మంది పత్రాల ను వివిధ కారణాలతో ఆర్‌ఓలు తిరిస్కరించినట్లు అధికారులు వెల్లడించారు. ఎన్నికల కమిషన్‌ నిబంధనల మేరకు ధ్రువీకరణ పత్రాలు లేకపోవడంతో తిరస్కరణకు గురయ్యాయి.

● జనగామ నియోజకవర్గంలో 32 మంది అభ్యర్థులు నామినేషన్‌ వేయగా.. తూడి సుజన్‌కుమార్‌(బీఎస్‌పీ), పెట్టెం మల్లికార్జున్‌(స్వతంత్ర), బి.సాంబయ్య(స్వతంత్ర), ముద్దసాని రమేష్‌ (స్వతంత్ర), జన్ను భారత్‌(స్వతంత్ర) పత్రాలు తిరస్కరణకు గురయ్యాయి.

● స్టేషన్‌ఘన్‌పూర్‌లో 28 మంది నామినేషన్లు వేశా రు. ఇందులో తాళ్లపెల్లి వెంకటస్వామి(బీఎస్‌పీ), గాదె సురేష్‌(ఆల్‌ ఇండియా మహిళా ఎంపవర్‌మెంట్‌ పార్టీ), చదిరం శ్రీధర్‌ (నవభారత నిర్మాణ్‌ సేవా పార్టీ), వడ్లకొండ పరశు ములు(స్వతంత్ర), శాడ శ్రీనివాస్‌(స్వతంత్ర) నామినేషన్లను తిరస్కరించారు.

● పాలకుర్తిలో 39 మంది నామినేషన్‌ వేశారు. ఇందులో బాదం సృజన్‌రెడ్డి (స్వతంత్ర), సుధాకర్‌గౌడ్‌ బండి(కాంగ్రెస్‌), పి.లక్ష్మీనర్సింహరాజు, (భారతీయ స్వదేశీ కాంగ్రెస్‌), వంశీ గిరగాని(యుగతులసి పార్టీ), భూక్యా రవి(స్వతంత్ర), సుకుమార్‌ తకావత్‌(స్వతంత్ర), మాచర్ల శ్రీనివాస్‌(స్వతంత్ర), జంగా రాఘవరెడ్డి (కాంగ్రెస్‌), సింగారం రవీందర్‌(బీఎస్‌పీ), నిరంజన్‌రెడ్డి(స్వతంత్ర), ఎర్రబెల్లి నరేందర్‌రావు(యుగతులసి పార్టీ), గోనె రవి(స్వతంత్ర), రేగుల ఉపేందర్‌(స్వతంత్ర), జిట్టబోయిన కుమార్‌(స్వతంత్ర), చిన్నల సందీప్‌(స్వతంత్ర), ఎల్‌.సురేష్‌(స్వతంత్ర), బోరెడ్డి మనేష్‌(స్వతంత్ర) తిరస్కరణ జాబితాలో ఉన్నారు.

యశస్వినిరెడ్డి నామినేషన్‌ ఓకే..

పాలకుర్తి కాంగ్రెస్‌ అభ్యర్థి విషయంలో మొదటి నుంచి సందిగ్ధత నెలకొంది. ఎన్‌ఆర్‌ఐ ఝాన్సీరెడ్డి పౌరసత్వం నిబంధనకు సంబంధించి అయోమ యం నెలకొనడంతో.. ఆమె కోడలు యశస్వినిరెడ్డి బరిలో దిగారు. యశస్వినిరెడ్డి పౌరసత్వం, ఓటుహక్కు తదితర విషయాల్లో ఆయా రాజకీయ పార్టీలు ముందు నుంచి అభ్యంతరం వ్యక్తం చేయడంతో కాంగ్రెస్‌ వర్గాల్లో కొంత అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. నామినేషన్ల స్క్రూటినీ సమయంలో యశస్విని పత్రాలు నిబంధనల మేరకు ఉన్నాయని పాలకుర్తి రిటర్నింగ్‌ అధికారి గ్రీన్‌ సిగ్న ల్‌ ఇవ్వడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

జంగా, సుధాకర్‌గౌడ్‌ నామినేషన్ల తిరస్కరణ

కాంగ్రెస్‌ వరంగల్‌ పశ్చిమ టికెట్‌ ఆశించి నిరుత్సాహానికి గురైన ఆ పార్టీ జనగామ జిల్లా మాజీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి ఓ పార్టీ నుంచి నామినేష న్‌ వేసిన విషయం తెలిసిందే. ఇదే తరుణంలో యశస్విని పౌరసత్వం, ఓటుహక్కు విషయంలో తిరకా సు రావడంతో కాంగ్రెస్‌ అధిష్టానం ఆదేశం మేరకు రాఘవరెడ్డి పాలకుర్తి అభ్యర్థిగా మరో నామినేషన్‌ వేశారు. పార్టీ ఇచ్చే బీఫారం, ఏ ఫారం సమర్పించకపోవడంతో నామినేషన్‌ను ఆర్‌ఓ తిరస్కరించారు. కాగా ఇక్కడి నుంచే కాంగ్రెస్‌ తరఫున నామినేషన్‌ వేసిన సుధాకర్‌గౌడ్‌ బండి(కాంగ్రెస్‌) పత్రాలు సైతం తిరస్కరణకు గురయ్యాయి.

మూడుచోట్ల బీఎస్పీ ఔట్‌

బహుజన్‌ సమాజ్‌ పార్టీ నుంచి జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్‌, పాలకుర్తి నియోజకవర్గాల నుంచి వేసిన ముగ్గురు అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. తూడి సుజన్‌కుమార్‌, తాళ్లపెల్లి వెంకట స్వామి, సింగారం రవీందర్‌ ఆర్‌ఓకు సమర్పించిన బీఫాంలలో తమ పేర్లు పేర్కొనక పోవడంతో నామినేషన్లను తిరస్కరించారు.

నామినేషన్‌ వేసిన అభ్యర్థులు 99 మంది

తిరస్కరణకు గురైన పత్రాలు 27

Advertisement
Advertisement