
ఇంటిబాట పట్టిన విద్యార్థులు
విజయకేతనం చూపిస్తున్న విద్యార్థినులు
● ఇంటిబాట పట్టిన విద్యార్థులు
జనగామ రూరల్: ఇంటర్మీడియట్ పరీక్షలు బుధవారంతో ముగియగా హాస్టళ్లు, రెసిడెన్సియల్ కళాశాలల్లోని విద్యార్థులంతా ఇంటిబాట పట్టారు. జిల్లా వ్యాప్తంగా 18 సెంటర్లలో ఈనెల 15 నుంచి మొదలైన పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్లు డీఐఓ శ్రీనివాస్ తెలిపారు. చివరిరోజు పరీక్షకు జనరల్ విభాగం 3,439 మందికి 3,391, ఒకేషనల్ విభాగం 418 మందికి 395 మంది విద్యార్థులు హాజరయ్యారని పేర్కొన్నారు. జనగామ, జఫర్‌గఢ్, స్టేషన్‌ఘన్‌పూర్ కళాశాలలను పరీక్షల కన్వీనర్ శ్రీనివాస్, డెక్ సభ్యులు లలిత, ఆంజనేయరాజు సందర్శించారు. ఇదిలా ఉండగా.. ఈనెల 31, ఏప్రిల్ 1వ తేదీన ఒకేషనల్ విద్యార్థులకు బ్రిడ్జి కోర్స్ పరీక్ష ఉందని, ఈ విషయాన్ని గమనించాలని తెలిపారు.


