ఉత్తమ్‌కు కరోనా పాజిటివ్‌ | TPPC Cheif UttamKumar Reddy Tested Positive | Sakshi
Sakshi News home page

ఉత్తమ్‌కు కరోనా పాజిటివ్‌

Apr 25 2021 3:03 AM | Updated on Apr 25 2021 12:43 PM

TPPC Cheif UttamKumar Reddy Tested Positive - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు, నల్లగొండ ఎంపీ ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి కరోనా సోకింది. గత మూడు రోజులుగా దగ్గుతో బాధపడుతున్న ఆయన శనివారం కోవిడ్‌ నిర్ధారణ పరీక్ష చేయించుకోగా పాజిటివ్‌ అని తేలింది. అయితే, ఛాతీ భాగంలో కొంత ఇన్‌ఫెక్షన్‌ ఉన్న కారణంగా మెరుగైన చికిత్స కోసం ఆయన గచ్చిబౌలిలోని ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీ (ఏఐజీ)లో చేరినట్టు సమాచారం. కాగా.. ర్యాపిడ్, ఆర్టీపీసీఆర్‌ పరీక్షల్లో తనకు కోవిడ్‌ నిర్ధారణ కాలేదని, ఊపిరితిత్తుల సీటీ స్కానింగ్‌లోనే ఈ విషయం వెల్లడైందని ఉత్తమ్‌ తెలిపారు. తనను కలిసినవారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని కోరారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు.

చదవండి: అందరికీ ఉచితంగా టీకా: సీఎం కేసీఆర్‌
చదవండి: ఆ ‘నలుగురు’గా మారిన ముస్లిం యువత

Advertisement
 
Advertisement
Advertisement