
ఉక్రెయిన్‌లో పదోరోజు భీకరంగా యుద్ధం కొనసాగుతోంది. ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యా వ్యూహత్మకంగా వ్యవహరిస్తోంది. రష్యా యుద్ధానికి అయిదు గంటలపాటు తాత్కాలికంగా విరామమిచ్చిన విషయం తెలిసిందే. అక్కడి కాలమాన ప్రకారం ఉదయం 9 గంటల నుంచి అయిదున్నర గంటల పాటు తాత్కాలిక కాల్పుల విరమణ ప్రకటించింది. ఆ సమయం ముగియడంతో ఉక్రెయిన్ – రష్యా మధ్య మళ్లీ యుద్ధం మొదలైంది. ప్రధాన నగరాలే లక్ష్యంగా చేసుకుని రష్యా దాడులు చేస్తోంది. ఉక్రెయిన్‌లోని పోర్టు సిటీ మారియుపోల్, వోల్నావోఖా నగరాలపై రష్యా క్షిపణులతో విరుచుకుపడింది.
ఉక్రెయిన్‌లో పర్యాటక ప్రాంతమైన మారియుపోల్‌ను స్వాధీనం చేసుకునేదిశంగా ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా ఆ ప్రాంతానికి రష్యా బలగాలు, ఆహారం, విద్యుత్, నీరు వంటి సదుపాయలను అడ్డుకుంటోంది. అయితే మారియుపోల్ నగర మేయర్ వాదిమ్ బాయ్‌చెన్‌కో రష్యా మానవత దృక్పథంలో వ్యవహరించాలని కోరారు. ఆహారం మందుల సరాఫరాను అడ్డుకోవద్దని తెలిపారు. మరోవైపు రష్యా శనివారం ఒక్క రోజే 24 క్షిపణులను ప్రయోగించింది.
చదవండి: రష్యాను రెచ్చగొట్టిన జెలెన్‌స్కీ: ఉక్రెయిన్ మాజీ ప్రధాని
Rally in occupied #Berdyansk. pic.twitter.com/ppZCAqqwBZ
— NEXTA (@nexta_tv) March 5, 2022
అయితే రష్యా యుద్ధంతో ఉక్రెయిన్‌లోని అందమైన నగరాలు శ్మశానంగా మారాయి. ఆర్తనాదాలు, రోదనలు మార్మోగుతున్నాయి. దీంతో రష్యా బలగాలకు వ్యతిరేకంగా ఉక్రెయిన్ ప్రజలు తిరగబడుతున్నారు. యుద్ధాన్ని ఆపాలంటూ రోడ్డెక్కిన ప్రజలు తమ దేశానికి వెళ్లిపోవాలంటూ నినాదాలు చేస్తున్నారు. రష్యా స్వాధీనం చేసుకున్న ఖేర్సన్ నగరంలో వందలాది మంది ఉక్రెయిన్లు రడ్లపైకి వచ్చారు. యుద్ధ ట్యాంకర్లకు కూడా వెరవకుండా రష్యా బలగాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారు. కాగా మార్చి 3న ఖేర్సన్ నగరాన్ని రష్యా స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.
చదవండి: Ukraine Crisis: ఢిల్లీ చేరుకున్న 145 మంది తెలుగు విద్యార్థులు..
Huge turnout at a protest against the Russian occupation in Russian-occupied Kherson.
— Valerie Hopkins (@VALERIEinNYT) March 5, 2022
pic.twitter.com/nJKkiD7U8i