ఈత కొట్టి సేద తీరాడు.. ఇంతలోనే

Alligator Attacks Man Swimming Became Viral Video - Sakshi

సరదాగా ఈత కొడుదామని బీచ్‌లో దిగాడు. ఈత కొట్టి అలసిపోయానని భావించిన అతను తన బోటుకు ఆనుకొని ఉన్న చెక్కపై నీటిలో తేలియాడుతూ విశ్రాంతి తీసుకున్నాడు. కానీ సడెన్‌గా ఒక మొసలి అతని వైపు దూసుకొచ్చింది. మొసలి వచ్చిన విషయాన్ని మొదట గమనించిన ఆ వ్యక్తి తర్వాత దానిని చూసి ఆశ్చర్యానికి గురయ్యాడు. నీళ్లలో ఉంటే మొసలిని ఎదుర్కోవడం కష్టమే.అప్పటికే మొసలి అతని భూజాన్ని గాయపరచడానికి సిద్దంగా ఉంది.  

కాస్త నిర్లక్ష్యం వహించినా మొసలి చేతిలో ప్రాణాలు పోవడం ఖాయం. దీంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఒక్కసారిగా గట్టిగా అరిచాడు. ఆ అరుపుకు మొసలి అలా పక్కకు జరిగిందో లేదో మనోడు ఒక్కసారిగా లేచి బోటులోకి దూకేశాడు. ఇదంతా ఎక్కడ జరిగిందో తెలియదు గాని వీడియో చూస్తే ఒళ్లు గగుర్పొడచడం మాత్రం ఖాయం. ఇప్పటివరకు ఈ వీడియోనూ 10లక్షలకు పైగా వ్యూస్‌ రాగా నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top