
మారుమోగిన హరేకృష్ణ నామస్మరణ
నగరంపాలెం: గుంటూరు నగర వీధుల్లో హరేకృష్ణ నామస్మరణ మారుమోగింది. హరేకృష్ణ గోకుల క్షేత్రం ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం చంద్రమౌళినగర్‌లోని మాజేటి రామ కల్యాణ మండపం వద్ద శ్రీజగన్నాథ రథయాత్ర ఉత్సవం వైభవంగా ప్రారంభమైంది. కొరిటెపాడు, లక్ష్మీపురం, బృందావన్ గార్డెన్స్ మీదగా మరలా రామ కల్యాణ మండపం వద్దకు చేరుకుంది. భక్తులు స్వామి వారి రథాన్ని లాగుతూ ముందుకు కదిలారు. అనంతరం భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు. కృష్ణ జన్మాష్టమి వరకు సహస్ర కోటి హరినామ జప యజ్ఞం నిర్వహించనున్నట్లు హరేకృష్ణ మూమెంట్ అధ్యక్షులు వంశీధర్ దాస తెలిపారు. పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి, మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు, ఎస్‌ఎల్‌వీ రాజు, క్రేన్ వక్కపొడి సంస్థల డైరక్టర్ గ్రంధి కాంతారావు పాల్గొన్నారు.

మారుమోగిన హరేకృష్ణ నామస్మరణ