
గుంటూరు పోస్టల్ ఉద్యోగులకు పురస్కారాలు
లక్ష్మీపురం: గుంటూరు డివిజన్ పోస్టల్ ఉద్యోగులకు ప్రాంతీయ పాస్‌పోర్ట్ సేవా దివస్ సందర్భంగా పురస్కారాలను అందజేశారు. విజయవాడలో శుక్రవారం జరిగిన నిర్వహించిన కార్యక్రమంలో గుంటూరు డివిజన్‌కు చెందిన పోస్టాఫీసుల సూపరింటెండెంట్ యు. యలమందయ్యకు ‘సర్టిఫికెట్ ఆఫ్ ఎక్సలెన్స్’, సిటిజన్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ పఠాన్ కరిముల్లా ఖాన్‌కు ‘సర్టిఫికెట్ ఆఫ్ అప్రిసియేషన్’ను అందించారు. విజయవాడ రైల్వే డీఆర్‌ఎం నరేంద్ర పాటిల్, విజయవాడ ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారి శివహర్షల చేతుల మీదుగా ఈ పురస్కారాలను వారు అందుకున్నారు. ఉద్యోగుల అంకిత భావం, ప్రజా సేవ పట్ల నిబద్ధతకు ఇది నిదర్శనం అని యు.యలమందయ్య చెప్పారు.