ప్రముఖ కొరియన్‌ సింగర్‌ అనుమానాస్పద మరణం: షాక్‌లో ఫ్యాన్స్‌ | Sakshi
Sakshi News home page

ప్రముఖ కొరియన్‌ సింగర్‌ అనుమానాస్పద మరణం: షాక్‌లో ఫ్యాన్స్‌

Published Sat, Apr 13 2024 5:36 PM

Pop Singer Park Bo Ram Dies After Fainting At Party Cops Launch Probe - Sakshi

అందమై రూపం, అంతకుమించిన మధురమైన గళం

30ఏళ్లకే  అందని లోకాలకు, కన్నీరుమున్నీరవుతున్న అభిమానులు

ప్రముఖ కొరియన్‌ పాప్‌ సింగర్‌ పార్క్ బోరామ్ అనుమానాస్పద మరణం మ్యూజిక్‌ ప్రపంచాన్ని, ఆమె అభిమానులను దిగ్భ్రాంతికి గురి చేసింది. 30 ఏళ్ల వయసులో  దక్షిణ కొరియా గాయని పార్క్ బో రామ్ కన్నుమూసింది. ద‌క్షిణ కొరియాలో గాయనిగా  మంచి క్రేజ్ సొంతం చేసుకున్న పార్క్ బోరామ్ మరణాన్ని అభిమానులు జీర్ణించు కోలేక పోతున్నారు.

నమ్యాంగ్జు పోలీస్ స్టేషన్ ఇన్వెస్టిగేటర్లు దాఖలు చేసిన నివేదిక ప్రకారం ఆమె చనిపోయే కొద్ది గంటల ముందు ఒక ప్రైవేట్ ఈవెంట్‌కు వెళ్లింది. అక్కడ  ఇద్దరు స్నేహితులతో కలిసి మద్యం సేవించింది. ఆ తరువాత రాత్రి 9:55 గంటలకు రెస్ట్‌రూమ్‌కి వెళ్లింది. 'సింక్‌పైకి వంగి’, అపస్మారక స్థితిలో చనిపోయి ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. దీని పోలీసులు విచారణ చేపట్టారు. 

దక్షిణ కొరియా సంగీత పరిశ్రమలో 10 సంవత్సరాలు పూర్తి చేసుకోనుంది. రచయిత కూడా అయిన బో రామ్‌ తన పదేళ్ల మైలురాయిని చేరుకున్నందుకు గౌరవసూచకంగా ఈ ఏడాది చివర్లో రెండు కొత్త పాటలను విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఇంతలోనే విషాదం చోటు చేసుకుంది. దీంతో ఆమె మరణంపై పలువురు తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. 

కె-పాప్ సింగర్ పార్క్ బో రామ్
పార్క్ బో-రామ్ 2010లో 17 ఏళ్ల వయస్సులో రియాలిటీ సింగింగ్ ఛాలెంజ్‌ 'సూపర్ స్టార్ K2'లో కనిపించి మెప్పించింది.  తరువాత 'బ్యూటిఫుల్' పాటతో కరియర్‌ ప్రారంభించింది.  ‘రీప్లే 1988’ లాంటి ఆల్బమ్స్‌లో మెలోడియస్‌ వాయిస్‌తో బాగా పాపులర్‌ అయింది. 2014 గావ్ చార్ట్ మ్యూజిక్ అవార్డ్స్‌లో, ఆమె ఆర్టిస్ట్ ఆఫ్ ది ఇయర్ ట్రోఫీని సొంతం చేసుకుంది.

Advertisement
 
Advertisement