అలాస్కా విమాన ప్రమాదం, మరో ఆశ్చర్యకరమైన విషయం

Apple iPhone survives with no scratches after16k feet drop from Alaska Airlines flight - Sakshi

16వేల అడుగుల ఎత్తునుంచి పడినా  చెక్కు చెదరని ఐఫోన్‌

అలాస్కా ఎయిర్‌లైన్స్ ASA 1282  విమానంలో ఊహించని పరిణామంలో   ప్రయాణీకులు అందరూ ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనలో మరో ఆశ్చర్యకరమైన సంఘటన కూడా నమోదైంది. అలాస్కా ఎయిర్‌లైన్స్  విమానం నుండి 16వేల అడుగుల కింద పడిపోయిన ఆపిల్ ఐఫోన్  చిన్న గీత కూడా పడకుండా , చెక్కు చెదరకుండా ఉండటం విశేషంగా నిలిచింది.

పోర్ట్‌లాండ్‌కు చెందిన సీనాథన్ బేట్స్  ఈ విషయాన్ని ట్విటర్‌లో షేర్‌ చేశారు.  విమానం శిధిలాలను గుర్తించిన ప్రాంతానికి సమీపంలో ఉన్న బార్న్స్ రోడ్‌లో నడుస్తున్నప్పుడు రోడ్డు పక్కన ఐఫోన్‌ను కనుగొన్నానని ఆయన పేర్కొన్నారు. అంతేకాదు ఎన్టీఎస్‌బీ సమాచారం  ప్రకారం ఆ ఘటనలో కనుగొన్న రెండో ఐఫోన్‌ అని, కానీ డోర్‌ మాత్రం దొరకలేదు అంటూ కమెంట్‌ చేశారు. దీంతో ఈ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.  అటు దీనిపై నెటిజన్లు  ఆశ్యర్యం వ్యక్తం చేశారు.

16వేల అడుగుల ఎత్తునుంచి పడినా దానికి గీతలు పడలేదని, కవర్ , స్క్రీన్ ప్రొటెక్టర్ చెక్కుచెదరకుండా ఉన్నాయని బేట్స్ వెల్లడించారు. ఐఫోన్ ఎయిర్‌ప్లేన్ మోడ్‌లో ఉందని , దానిని కనుగొన్నప్పుడు అన్‌లాక్ చేసినట్టు వెల్లడించారు. ఈ సమాచారాన్ని ఎన్‌టీఎస్‌బీ ఇచ్చినట్లు ట్విటర్‌(ఎక్స్‌)లో షేర్‌ చేశారు. దీన్ని అలాస్కా ఎయిర్‌లైన్ ప్యాసింజర్‌కు చెందినదని నిర్ధారించారు. అయితే ఇది ఏ మోడల్ ఐఫోన్‌ అనే  వివరాలు అందుబాటులో లేవు.

కాగా పోర్ట్‌ల్యాండ్, ఒరెగాన్ నుండి కాలిఫోర్నియాలోని అంటారియోలో చెందిన అలాస్కా విమానం గాలిలో ఉండగా దాని డోర్‌ ఊడి ఎగిరిపోయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆ సీట్లలో ఉన్న ప్రయాణికుల చేతుల్లోని మొబైల్‌ ఫోన్లతోపాటు, కొన్ని వస్తువులు కూడా ఆ విమానం నుంచి గాల్లోకి ఎగిరిపడ్డాయి.  దీంతో ఆ విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్‌ చేశారు. చివరకు  అదే ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసరంగా ల్యాండ్  కావడంతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top