కనీస వేతనాల అమలులో అన్యాయం
ఏలూరు(ఆర్‌ఆర్‌పేట): మున్సిపల్ స్కూల్ స్వీపర్లు, శానిటేషన్ వర్కర్లకు కనీస వేతనాలు అమలు చేయకుండా అన్యాయం చేశారని మున్సిపల్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.సోమయ్య అన్నారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ట్రిబ్యునల్ తీర్పులు, కౌన్సిల్ తీర్మానాల అమలు కోసం స్కూల్స్ స్వీపర్లు, శానిటేషన్ వర్కర్లు ఆందోళన చేశారు. సోమయ్య మాట్లాడుతూ నెలంతా పనిచేస్తే ఒక స్కూల్ స్వీపర్‌కు రూ.4 వేలు, స్కూల్ శానిటేషన్ వర్కర్‌కు రూ.6 వేలు ఇవ్వడం దారుణమన్నా రు. స్కూలు స్వీపర్లు, శానిటేషన్ వర్కర్ల శ్రమను గుర్తించి ట్రిబ్యునల్ తీర్పు, కౌన్సిల్ తీర్మానాలు అ మలు చేసి ఫుల్ టైం వర్కర్‌గా గుర్తించాలని, జీఓ 7 ప్రకారం రూ.15,000 కనీస వేతనాలు ఇవ్వాలన్నారు. ఈనెల 8,9, జనవరి 5, 6, 7 తేదీల్లో రిలే నిరాహార దీక్షలు చేపడతామని చెప్పారు. ఐఎఫ్‌టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు, మున్సిపల్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నాయకులు బాలు, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వినతి పత్రం, సమ్మె నోటీసులను అడిషనల్ కమిషనర్ శ్రీనివాసరావుకు అందించారు.


