విషాద ఛాయలు
గండి పోశమ్మ ఆలయానికి వెళ్లి ప్రమాదానికి గురై ఇద్దరు మృతిచెందడంతో అబ్బిరాజుపాలెం, దొడ్డిపట్లలో విషాదఛాయలు అలముకున్నాయి. 8లో u
కై కలూరు: వైఎస్సార్‌సీపీ జిల్లా విస్తృత స్థాయి సమావేశాన్ని మంగళవారం ఉదయం 11 గంటలకు కైకలూరులో ని ర్వహించనున్నట్టు పార్టీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్) సోమవారం తెలిపారు. సమావేశానికి శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, ఏలూరు జిల్లా పార్లమెంట్ పరిశీలకుడు, ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్, పార్లమెంట్ సమన్వయకర్త కారుమూరి సునీల్‌కుమార్ యాదవ్, జిల్లాలో ని యోజకవర్గాల పార్టీ సమన్వయకర్తలు, ముఖ్య ప్ర ధాన నాయకులు హాజరవుతారన్నారు. పార్టీ విధి విధానాలపై చర్చ జరుగుతుందన్నారు.
భీమవరం: స్థానిక జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదికలో ఎస్పీ అద్నాన్ నయీం అస్మి బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ప్రజాసమస్యలపై త్వరితగతిన స్పందించి నిర్ణీత గడువులోగా చట్టపరిధిలో శాశ్వత పరిష్కారం చూపాలని పోలీసు అధికారులు ఆదేశించారు. పలు ప్రాంతాలకు చెందిన 13 మంది ఫిర్యాదులు అందించారు.


