మాక్ అసెంబ్లీ విద్యార్థులకు అభినందన
భీమవరం (ప్రకాశంచౌక్): భారత రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా నవంబర్ 26న మాక్ అసెంబ్లీ నిర్వహణలో ప్రజా ప్రతినిధులుగా ప్రతిభ చూపిన జిల్లాకు చెందిన ఎనిమిది మంది విద్యార్థులను కలెక్టర్ చదలవాడ నాగరాణి అభినందించారు. కలెక్టర్ మాట్లాడుతూ పశ్చిమగోదావరి జిల్లా ఏడు నియోజకవర్గాల నుంచి ఒక్కొక్క విద్యార్థి ప్రజాప్రతినిధిగా హాజరై అద్భుత నైపుణ్యాన్ని ప్రదర్శించడం ఆనందంగా ఉందన్నారు. ఈ మాక్ అసెంబ్లీ నిర్వహణ ద్వారా విద్యార్థులకు చట్టసభలలో బిల్లులు ఎలా పాస్ చేస్తారు, జీరో అవర్ అంటే ఏంటి, బడ్జెట్ ఎలా ఆమోదిస్తారు తదితర విషయాలను అవగాహన చేసుకోవడానికి వీలు కలిగిందన్నారు. వీరికి మొమెంటో, మెడల్ బహుకరించి కలెక్టర్ అభినందించారు.


