కొరగుంటపాలెంలో అగ్నిప్రమాదం
ముదినేపల్లి రూరల్: మండలంలోని కొరగుంటపాలెంలో సోమవారం జరిగిన అగ్నిప్రమాదంలో 5 ఎకరాల గడ్డివాము దగ్ధమైంది. గ్రామానికి చెందిన పరసా నాగేశ్వరరావు, మాధవరావుకు చెందిన గడ్డివాముకి మంటలు అంటుకుని ఎగిసిపడ్డాయి. స్థానికులు అప్రమత్తమై కై కలూరు అగ్రిమాపక సిబ్బందికి సమాచారమందించారు. వెంటనే చేరుకున్న సిబ్బంది మంటలను పూర్తిస్థాయిలో అదుపుచేసి పరిసర ప్రాంతాలకు వ్యాపించకుండా చేశారు. సుమారు రూ.80వేల వరకు నష్టం జరిగి ఉంటుందని అంచనా.
భీమవరం: మద్యం మత్తులో తల్లిని కుమారుడు గాయపరచిన ఘటన భీమవరంలో చోటుచేసుకుంది. భీమవరం వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగింది. శీలం మంగాయమ్మ కుమారుడు ముత్యాలు మద్యం తాగి వాగ్వాదానికి దిగారు. కుమారుడు తల్లిని తలపై కొట్టి గాయపరిచాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ బీవై కిరణ్‌కుమార్ చెప్పారు.


