వెచ్చటి నేస్తంతో ఉపాధి
● ఊరూరా శీతాకాలపు దుస్తుల విక్రయం
● మధ్యప్రదేశ్ యువకుల జీవనోపాధి
భీమడోలు: చలికాలంలో వెచ్చటి నేస్తాలు రగ్గులు, స్వెట్టర్లు, మంకీ క్యాప్‌లు. వీటిని విక్రయించేందుకు మధ్యప్రదేశ్ యువకులు వందల కిలోమీటర్ల దాటి వస్తుంటారు. శీతాకాలంలో ఊరూరా ఉన్ని వస్తువుల దుకాణాలు ఏర్పాటు చేసి రగ్గులు, స్వెట్టర్లు, మంకీ కా్‌య్ప్‌ల విక్రయంతో జీవనోపాధి పొందుతున్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జీన్ జిల్లా మిలేనియాకు చెందిన యువకులు ప్రతి ఏటా చలి కాలంలో మూడో నెలల పాటు భీమడోలు జంక్షన్‌లో ప్రాంతంలో చిన్న టెంట్లు వేసుకుని ఉన్ని దుస్తులు విక్రయిస్తున్నారు. సీజన్ ముగిసిన తర్వాత తమ సొంత ఊర్లకు తిరిగి వెళుతుంటారు. ఇలా వివిధ ప్రాంతాల్లో ఉన్ని దుస్తులను విక్రయించేందుకు తమ ప్రాంతం నుంచి వందలాది మంది వస్తుంటారని చెబుతున్నారు.
చలి పెరిగితే.. వ్యాపారం జోష్
శీతాకాలంలో చలి తీవ్రత ఎక్కువగా ఉన్నంతసేపు తమ వ్యాపారం జోష్‌గా సాగుతుందని చిరు వ్యాపారులు చెబుతున్నారు. కొద్దిపాటు సొమ్ముతో స్టాకు తెచ్చుకుని వ్యాపారం చేస్తుంటామని, డిమాండ్‌ను బట్టి అదనపు స్టాక్ కోసం ఆర్దర్లు పెట్టడం జరుగుతుందని చెబుతున్నారు. స్విట్టర్లు రూ.350 నుంచి రూ.500, మంకీ క్యాంపులు రూ.100 నుంచి రూ.150, దుప్పట్లు ధర రూ.600కు పైగా విక్రయిస్తున్నామన్నారు. ఈ సంవత్సరం చలి ఇప్పుడిప్పుడే పెరుగుతుందని, దీంతో ఇంకా వ్యాపారాలు ఊపందుకోలేదని చెబుతున్నారు.
వెచ్చటి నేస్తంతో ఉపాధి
వెచ్చటి నేస్తంతో ఉపాధి


