వైభవంగా సహస్ర దీపారాధన
ముదినేపల్లి రూరల్: సింగరాయపాలెం–చేవూరుపాలెం సెంటర్‌లోని శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయ షష్ఠి ఉత్సవాలు వైభవంగా జరగుతున్నాయి. ఇందులో భాగంగా సోమవారం సహస్ర దీపారాధన, సహస్ర లింగార్చన కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. ఆలయ సహాయ కమిషనర్ ఆర్.గంగాశ్రీదేవి ఉత్సవకమిటీ సభ్యులు స్వామివారికి పూజలు నిర్వహించి సహస్ర దీపారాధన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పరిసర గ్రామాల నుంచి విశేష సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమానికి హాజరై తిలకించారు. ఉదయం వేళ స్వామి, అమ్మవార్లకు లక్ష బిల్వార్చన, రుద్రాభిషేకం కార్యక్రమాలు కన్నులపండువగా జరిగాయి. ఆలయ ప్రధాన అర్చకుడు తోలేటీ వీరభద్రశర్మ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా సహాయ కమిషనర్, ఉత్సవకమిటీ సభ్యులు పర్యవేక్షణ చేశారు. ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 4న సుబ్రహ్మణ్య హవనం నిర్వహిస్తామని సహాయ కమిషనర్ తెలిపారు. ఈ హవనంలో పాల్గొనే భక్తులు రూ.1516 రుసుంగా చెల్లించి పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. ఈ హవనంలో పాల్గొనేవారు సంప్రదాయ దుస్తులు మాత్రమే ధరించి రావాలని కోరారు.
వైభవంగా సహస్ర దీపారాధన


