ర్యాపిడ్ చెస్ విజేతగా లక్ష్మణరావు
ఏలూరు రూరల్: రాష్ట్రస్థాయి ర్యాపిడ్ చెస్ పోటీల్లో ఏలూరు చెస్ ఆర్బిటర్ డి.లక్ష్మణరావు విజేతగా నిలిచాడు. సోమవారం ఏలూరు శివారు వట్లూరు సిద్ధార్ధ క్వెస్ట్ స్కూల్‌లో చెస్ పోటీలు జరిగాయి. ఈ పోటీలకు వివిధ ప్రాంతాలకు చెందిన చెస్ క్రీడాకారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పోటీల్లో లక్ష్మణరావు ప్రథమస్థానం, జి.అభిషేక్ రెండో, జె.అక్షిత్ మూడో స్థానం సాధించారు. అనంతరం జరిగిన బహుమతి ప్రదానోత్సవంలో స్కూల్ డైరక్టర్ కె.సిద్దార్ధ, అనసూయ చెస్ అకాడమీ డైరక్టర్ ఎం.కిషోర్,తదితరులు సర్టిఫికెట్లు, మొమెంటోలు అందజేశారు.
పెదవేగి: ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై కూలీ మృతి చెందాడు. ఈ ఘటన పెదవేగి మండలం రామసింగవరంలో సోమవారం జరిగింది. పెదవేగి మండలం కూచిపూడికి చెందిన దిమ్మిటి చిన్నరాటాలు (36) సోమవారం పామాయిల్ తోటలో గెలలు నరుకుతుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురయ్యాడు ఘటన స్థలంలోనే అతను మృతి చెందాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తాడేపల్లిగూడెం రూరల్: కొట్లాట కేసులో ఇద్దరికి జైలు శిక్ష విధిస్తూ మెజిస్ట్రేట్ తీర్పునిచ్చారని రూరల్ ఎస్సై జేవీఎన్. ప్రసాద్ తెలిపారు. మండలంలోని అప్పారావుపేట గ్రామానికి చెందిన అడపా వెంకటేష్‌పై అడపా నారాయణ, అడపా విష్ణు 2018లో దాడి చేశారు. దీనిపై అప్పట్లో కేసు నమోదైంది. కేసు విచారణలో భాగంగా నేరం రుజువు కావడంతో నారాయణ, విష్ణుకు 15 నెలలు జైలు, రూ.5వేలు జరిమానా విధిస్తూ మెజిస్ట్రేట్ తీర్పునిచ్చారని ఎస్సై తెలిపారు.
ర్యాపిడ్ చెస్ విజేతగా లక్ష్మణరావు


